రామ్ చరణ్ , ఉపాసనల( Ram Charan, Upasana ) కూతురు క్లీంకారకు( klinkara ) సంబంధించిన ఫోటోల కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ ఏడాది అయినా క్లీంకార ఫోటోలను రివీల్ చేయాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు బిడ్డను ఆలస్యంగా కనడం గురించి సైతం ఉపాసన స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.పెళ్లైన పదేళ్ల తర్వాత చరణ్ ఉపాసన తల్లీదండ్రులైన సంగతి తెలిసిందే.
ఉపాసన మాట్లాడుతూ అందరూ తల్లి కావడం గ్రేట్ అనుకుంటారని నేను మాత్రం డబుల్ గ్రేట్ అని ఫీలవుతున్నానని చెప్పుకొచ్చారు.ఇంకా ఎప్పుడు బిడ్డకు జన్మనిస్తారనే మాటలు నా వరకు వచ్చాయని ఆమె తెలిపారు.
ఏదైనా సమస్య ఉందా అని కూడా మాట్లాడుకున్నారని ఆమె పేర్కొన్నారు.అయితే మేము అన్ని విధాలా సిద్ధంగా ఉన్న సమయంలోనే పిల్లల్ని కనాలని అనుకున్నామని ఉపాసన వెల్లడించారు.

అందుకే ఇన్ని సంవత్సరాలు పట్టిందని ఉపాసన కామెంట్లు చేశారు.రామ్ చరణ్ ఎప్పుడూ ప్రేమలో పడకు ప్రేమలో ఎదుగుదాం అని చెబుతాడని ఆమె చెప్పుకొచ్చారు.మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటామని గౌరవించుకుంటామని ఉపాసన అన్నారు.మా ఇద్దరి మధ్య హద్దులు కూడా ఉంటాయని ఉపాసన చెప్పుకొచ్చారు.కెరీర్ పరంగా ఒకరి దానిలో మరొకరు కల్పించుకోమని ఆమె అన్నారు.

2012 సంవత్సరంలో రామ్ చరణ్ ఉపాసన పెళ్లి జరిగిందనే సంగతి తెలిసిందే.పెళ్లి తర్వాత రామ్ చరణ్ ఉపాసన అన్యోన్యంగా ఉన్నారు.ఉపాసన వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
చరణ్ ఉపాసన కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.రామ్ చరణ్ వరుసగా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
చరణ్ నెక్స్ట్ లెవెల్ సినిమాలలో నటించాలని అభిమానులు ఫీలవుతున్నారు.చరణ్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.