Jagapathi Babu : అతను నా కొడుకులాంటి వ్యక్తి.. వైరల్ అవుతున్న జగపతిబాబు ఎమోషనల్ కామెంట్స్!

టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన జగపతిబాబు( Jagapathi Babu ) సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ రోల్స్ లో, తండ్రి రోల్స్ లో నటిస్తూ సత్తా చాటుతున్నారు.జగపతిబాబు రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉంది.

 Jagapati Babu Emotional Comemnts Goes Viral In Social Media Details Here-TeluguStop.com

లెజెండ్ సినిమాతో( Legend movie ) రీఎంట్రీ ఇవ్వడం జగపతిబాబు కెరీర్ కు ఎంతో ప్లస్ అయింది.భిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తున్న జగపతిబాబు ఎలాంటి కథలో నటించినా పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

తాజాగా జగపతిబాబు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.తన మేనేజర్ పుట్టినరోజు సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన జగపతిబాబు ఆసక్తికర కామెంట్లు చేశారు.

మా మేనేజర్ పేరు మహేష్( Mahesh ) అని అతను నా కొడుకులాంటి వ్యక్తి అని జగపతిబాబు చెప్పుకొచ్చారు.మా ఫ్యామిలీ మెంబర్స్ తో మా ఇంట్లో భోజనాల పండుగ అని నాకు ఒక్కడికే రోజంతా మజ్జిగ అంటూ జగపతిబాబు పోస్ట్ పెట్టారు.

జగపతిబాబు చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.జగపతిబాబు తన దగ్గర పని చేస్తున్న వాళ్లకు సైతం ఊహించని స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ విషయంలో జగపతిబాబు నిజంగా గ్రేట్ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్న జగపతిబాబు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకుంటారేమో చూడాలి.

జగపతిబాబు రాబోయే రోజుల్లో మరింత ఎదగాలని నెటిజన్లు చెబుతున్నారు.టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు జగపతిబాబుకు మరిన్ని మంచి పాత్రలు ఇవ్వాలని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.జగపతిబాబును అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఇతర భాషల్లో సైతం జగపతిబాబుకు మంచి గుర్తింపు ఉంది.జగపతిబాబు విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube