సమాధానం చెప్పండి-స్కూటీ గెలుచుకోండి విశాఖ రైల్వే జోన్( Visakha Railway Zone ) ను ఎప్పుడు ప్రారంభిస్తారు?విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలను అధికారికంగా ఏ తేదీ నుండి ప్రారంభిస్తారో? సరియైన సమాధానం చెప్పిన వారికి ఎలక్ట్రిక్ స్కూటీని బహుమతిగా అందజేస్తామని జన జాగరణ సమితి ప్రకటించింది.ఈ సందర్భంగా విశాఖ నగర కన్వీనర్ చింతపల్లి సునీల్ కుమార్ ( hintapalli Sunil Kumar )తో కలిసి రాష్ట్ర కన్వీనర్ వాసు పోస్టర్ ను విడుదల చేశారు.
వాసు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మేధావులు, విద్యావంతుల మేధస్సుకు జన జాగరణ సమితి మరొక్కసారి పరీక్ష పెడుతుంది అని సమాధానం తెలిసిన వాళ్ళు 7288904076 ఫోన్ నెంబర్ కు వాట్సాప్ చేయాలని కోరారు.విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష అని 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను 2019 ఫిబ్రవరి 27వ తేదీన ప్రకటించింది.
అప్పటినుండి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు అధికారికంగా ఎప్పటినుండి ప్రారంభం అవుతాయని ఉత్తరాంధ్ర ప్రజలు తీవ్ర గందరగోళంలో ఉన్నారని మేధావులు,విద్యావంతులు సరైన సమాధానం చెప్పి స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.