టీడీపీ అధినేత చంద్రబాబుపై( Chandrababu ) మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబుకు ఏం విజన్ ఉందో చెప్పాలన్నారు.
మ్యానిఫెస్టోను తొలగించడమే చంద్రబాబు విజన్ అని విమర్శించారు.చంద్రబాబు సభలకు ప్రజల నుంచి ఎటువంటి స్పందన లేదని అంబటి రాంబాబు తెలిపారు.
ప్రజలను మభ్యపెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు.
అనంతరం పవన్ కల్యాణ్ పై( Pawan Kalyan ) ధ్వజమెత్తిన ఆయన జనసేన దేనికీ సిద్ధం గా ఉందో చెప్పాలన్నారు.ప్యాకేజీ తీసుకోవడానికి సిద్ధమా? లేక చంద్రబాబును భుజాన ఎత్తుకుని తిరగడానికి సిద్ధమా? అనేది చెప్పాలన్నారు.ఎన్నికల బరిలో సీఎం జగన్( CM Jagan ) అర్జునుడిలా ప్రవేశిస్తారన్న ఆయన ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.