భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ ను ఉచితంగా వీక్షించనున్న 25 వేల మంది విద్యార్థులు..!

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్( India vs England ) మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ జనవరి 25న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే.హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టెస్ట్ మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది.

 25 Thousand Students Will Watch The India-england Test Match For Free , India Vs-TeluguStop.com

జనవరి 18 నుంచి పేటీఎం ఇన్ సైడర్ యాప్( Paytm insider app ) ద్వారా మ్యాచ్ టికెట్లు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయి.మిగిలిన టిక్కెట్లు జనవరి 22 నుండి జింఖానాలో, ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉంటాయి.

అయితే ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకునేవారు ప్రభుత్వ గుర్తింపు కార్డును తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( Hyderabad Cricket Association )తెలంగాణలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల విద్యార్థుల కోసం 25 వేల కాంప్లిమెంటరీ పాస్ లను కేటాయించింది.ఐదు రోజులపాటు జరిగే ఈ టెస్ట్ మ్యాచ్ లో రోజుకు 5000 పాస్ లు ఇస్తారు.విద్యార్థులకు ఉచిత భోజనంతో పాటు త్రాగునీరు కూడా ఇస్తారు.

జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న తెలంగాణలోని భారత సాయుధ దళాల సిబ్బందికి మరియు వారి కుటుంబాలకు కూడా ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.ఆసక్తిగల సాయుధ సిబ్బంది జనవరి 18 లోపు కుటుంబ సభ్యుల వివరాలతో సహా వారి డిపార్ట్మెంట్ హెడ్ సంతకం చేసిన లేఖతో కూడిన ఈ మెయిల్ ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ CEO కు పంపించాలి.ఇక టికెట్ ధరలను ఒకసారి పరిశీలిస్తే.సాధారణ టికెట్లు రూ.200 నుంచి రూ.1250 గా ఉన్నాయి.ఆతిథ్యంలో కార్పొరేట్ బాక్స్ నార్త్ రూ.3000, కార్పొరేట్ బాక్స్ సౌత్ ఆతిథ్యం రూ.4000 గా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube