అమరావతే( Amaravati ) రాజధాని అని తాను, జనసేనాని పవన్ కల్యాణ్ హామీ ఇస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.అమరావతి నుంచి పేదల పాలన ప్రారంభం అవుతుందని తెలిపారు.
దేవతల రాజధానిని రాక్షసులు పాలిస్తున్నారని చంద్రబాబు( Chandrababu naidu ) విమర్శించారు.85 రోజుల కౌంట్ డౌన్ ను అమరావతిలో ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.వైసీపీ విముక్త రాష్ట్రం నుంచి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.యువతకు ఉపాధి కల్పించే బాధ్యత కూడా తామేనని తెలిపారు.అలాగే విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు.కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.