పురాతన, చారిత్రక నిర్మాణాలను సంరక్షించడానికి చాలామంది ప్రయత్నిస్తుంటే, మరికొందరు మాత్రం వాటిని ఉద్దేశపూర్వకంగా నాశనం చేస్తూ అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తున్నారు.తాజాగా ఒక టూరిస్ట్ రాజస్థాన్( Rajasthan )లోని కుల్‌ధారా గ్రామంలో ఓ చారిత్రక గోడను ధ్వంసం చేశాడు.
అతను గోడను తన్నుతున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.ఈ పర్యాటకుడు తన కాలుతో గోడలోని ఒక భాగాన్ని తన్నిపడేయడం, తానేదో ఘనకార్యం చేస్తున్నట్లు ఆ సంఘటనను కెమెరాలో రికార్డ్ చేయించుకోవడం జరిగింది.
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం అతడు ఈ పనికిమాలిన పని చేసినట్లు తెలుస్తోంది.
వీడియోలో అతను హెరిటేజ్ సైట్( Heritage Site ) చారిత్రాత్మక గోడను దెబ్బతీస్తున్నట్లు చూసిన తర్వాత చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అతడు ఈ పని చేసిన తర్వాత అతని స్నేహితుడితో ముసిముసిగా నవ్వుతూ, ఎలాంటి పశ్చాత్తాపం కనబరచకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్లు వీడియోలో మనం చూడవచ్చు.
నెటిజన్లు ఇతడి పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరుతున్నారు. జైసల్మేర్‌లోని పాడుబడిన గ్రామం, పురావస్తు ప్రదేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని దానికి నష్టం కలిగించినందుకు పర్యాటకుడికి తగిన బుద్ధి చెప్పాలని మళ్ళీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుతున్నారు.అంగీకరించదని ఈ చర్య చేసినా సదరు టూరిస్ట్ పై కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులకు తెలియజేసినట్లు లోకల్ మీడియా తెలియజేసింది.
వీడియోలో ఉన్న వ్యక్తులను త్వరగా పట్టుకోవాలని కూడా నెటిజన్లు కోరారు.కుల్‌ధారా గ్రామం( Kuldhara village ) చాలా పురాతనమైనది.కొన్ని శతాబ్దాల క్రితం ఈ గ్రామంలో పలివాల్ బ్రాహ్మణ వర్గానికి చెందిన అనేక మంది ప్రజలు జీవనం కొనసాగించారు.ఇప్పుడు ఈ గ్రామంలో ఎవరూ నివసించడం లేదు.
ఈ గ్రామంలో దెయ్యాలు తిరుగుతాయని నమ్మి కొందరు ఇక్కడికి వచ్చేందుకే భయపడుతున్నారు.అయితే ఈ ఊరు గురించి చాలామందికి తెలియడం వల్ల కొంతకాలానికి ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా అవతరించింది.
చాలామంది టూరిస్ట్ లో ఇక్కడికి వచ్చి కులధార శిథిలాలను చూసి చరిత్ర గురించి తెలుసుకుంటున్నారు.అయితే కొందరు ఆ చరిత్రను నాశనం చేస్తూ అందరికీ కోపం తెప్పిస్తున్నారు.