పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) ప్రస్తుతం సలార్(Salaar) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా తర్వాత ఈయన మంచి సక్సెస్ అందుకున్నారని చెప్పాలి.
ఇలా సలార్ సినిమా విడుదలైన తరువాత ఈ సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఎప్పుడు భోజనం చేసినా గొడ్డుకారంతోనే( Chilli Powder ) తింటాడనే విధంగా డైరెక్టర్ మనకు చూపించారు.
అయితే చాలామంది ప్రభాస్ ఇలా గొడ్డుకారం తినడం వెనుక కారణమేంటి అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.సాధారణంగా ఎవరికైనా పౌరుషం రావాలి కోపం రావాలంటే కారం తింటారు.
కానీ ప్రభాస్ మాత్రం శాంతంగా ఉండటం కోసం గొడ్డుకారం తింటారు.

ప్రభాస్ ఇలా కారంతో తినడానికి కారణం ఏంటి అనే విషయం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమాలో ఒక చిన్న పాప పుట్టినరోజు సందర్భంగా కేక్ తీసుకొని ప్రభాస్ వద్దకు వస్తుంది.కేక్ కోయమని చెప్పగా ప్రభాస్ తల్లి వచ్చి ముందు ఆ కత్తి ఇచ్చేయ్ దేవా అంటూ భయపడుతూ ఆ కత్తి తీసుకుంటుంది.
అధి కేవలం ప్లాస్టిక్ కత్తి అయినప్పటికీ తన తల్లి మాత్రం చాలా భయపడుతుంది.అంటే ప్రభాస్ చేతిలో కత్తి (Knife) కనక ఉంటే ఎవరినైనా చంపేస్తారా అన్న భయం తన తల్లి ద్వారా చూపించారు డైరెక్టర్.

ఇలా తనకు కత్తి కనపడితే చంపేస్తారన్న భయంతో తన ఇంట్లో ఎలాంటి కూరలు కట్ చేసే కత్తి లేకపోవడంతోనే తన తల్లి ఆయనకు కేవలం కారం మాత్రమే పెడుతుంది.ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)మనకు పరోక్షంగా చూపించారు అంటూ కొందరు కామెంట్స్ చేయడమే కాకుండా వామ్మో నీ బ్రెయిన్‌కి సలాం అబ్బా.చిన్న ప్లాస్టిక్ కత్తిలో ఇంత ఎలివేషన్, ఇన్ఫర్మేషన్ దాచావంటే నువ్వు చాలా గ్రేట్ డైరెక్టర్ అంటూ ప్రశాంత్ పై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.