ఏపీ సీఎం జగన్ వైఎస్ఆర్ కడప జిల్లాకు వెళ్లనున్నారు.ఈ మేరకు ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఆయన జిల్లాలో పర్యటించనున్నారు.
ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ముందుగా తాడేపల్లి నుంచి కడప ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు సీఎం జగన్. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా గోపవరం మండలానికి చేరుకోనున్నారు.ఈ క్రమంలోనే ఉదయం 11.30 గంటలకు సెంచురీ ఫ్లై ఇండస్ట్రీస్ ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.తరువాత మధ్యాహ్నం 12.30 గంటల వరకు హై ప్రెజర్ ల్యామినేట్ ప్లాంట్, మధ్యాహ్నం 1.15 గంటలకు డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభిస్తారు.ఈ క్రమంలోనే కడప, చుట్టుపక్కల ప్రాంతాల్లోని అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్న ఆయన అంతర్జాతీయ హాకీ కోర్టుకు శంకుస్థాపన చేయనున్నారు.అనంతరం రాత్రి ఇడుపులపాయలో సీఎం జగన్ బస చేయనున్నారు.
సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.