మీరా చోప్రా (Meera Chopra) అంటే ఎవరికి గుర్తుకు రాదు కానీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా చేసిన బంగారం సినిమా( Bangaram Movie ) హీరోయిన్ అంటే అందరూ ఇట్టే గుర్తు పట్టేస్తారు.ఈ సినిమాతో మీరా చోప్రా కి మంచి గుర్తింపు వచ్చినప్పటికీ ఆ తర్వాత తెలుగులో ఆమె అనుకున్నంత సక్సెస్ అయితే కాలేదు.
ఇక మీరా చోప్రా ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) సిస్టర్.ప్రియాంక చోప్రా స్టార్ నటిగా కొనసాగుతుంటే మీరా చోప్రా మాత్రం అవకాశాల కోసం అందర్నీ అడుక్కునే పరిస్థితి కి వచ్చింది.
రీసెంట్ గా ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.ఛాన్స్ ల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి నా కాళ్ళు అరిగిపోయాయి.
అన్నింటిని అధిగమించి ముందుకు వెళ్లాలి అని అనుకుంటున్నాను.అందుకే ప్లీజ్ నాకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వండి.నటిగా నేనేంటో నాకు తెలుసు.నేను చాలా బాగా నటిస్తానని మీ అందరికీ తెలుసు.
అందుకే బహిరంగంగానే మిమ్మల్ని వేడుకుంటున్నాను.నాకు సినిమాల్లో మంచి మంచి పాత్రలు ఇవ్వండి.
నాకు ఒకసారి కాల్ చేయండి.

2019లో వచ్చిన సెక్షన్ 375 సినిమా (Section 375 Movie) ద్వారా మీరా చోప్రా కంబ్యాక్ ఇచ్చింది అని అందరూ అనుకున్నారు.అలాగే ఆ సినిమాలో నా నటన బాగుంది.ఈ సినిమాలో నా నటన చూసి విమర్శకులు కూడా ప్రశంసించారు.
దాంతో ఈ సినిమా తరువాత నాకు వరస అవకాశాలు వస్తాయని కొంతమంది రాసుకొచ్చారు.కానీ వాళ్ళు అనుకున్నట్టు నాకు ఒక్క అవకాశం కూడా రావడం లేదు.

నేను మళ్ళీ మీ ముందుకు రావాలి అనుకుంటున్నాను.అందుకే నాకు అవకాశాలు ఇవ్వండి అంటూ మీరా చోప్రా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.ప్రస్తుతం మీరా చోప్రా మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.ఇక మీరా చోప్రా తాజాగా సఫేద్ (Safed) అనే సినిమాలో నటించింది.ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కాబోతుంది.