బన్నీ వాస్ కి కీలక పదవి ఇచ్చిన జనసేన!

గీతా కాంపౌండ్వ్యక్తి అయిన బన్నీ వాస్( Bunny vasu ) అల్లు అర్జున్ కు అన్నీ తానే వ్యవహరిస్తూ ఉంటారు.గతంలో కూడా ప్రజారాజ్యం సమయం నుంచి మెగా కాంపౌండ్ కు దగ్గరగా మసిలే వ్యక్తి గా బన్నీ వాస్ కు పేరుంది .

 Janasena Gave A Key Post To Bunny Vasu , Bunny Vasu , Janasena , Tdp, Pawan K-TeluguStop.com

పార్టీ ప్రచార కార్యక్రమాలలో తనదైన సహకారం అందిస్తూ ఉంటారు 2019 ఎన్నికల్లో కూడా జనసేన తరుపున భీమవరంలో అన్ని తానే అయ్యి వ్యవహరించారన్న వార్తలు కూడా ఉన్నాయి.పవన్ ను ఎలాగైనా గెలిపించాలని అక్కడ ఆయన సాయశక్తులా ప్రయత్నం చేశారట .ఇప్పటివరకూ అనదికారికం గా వ్యవహారాలు చక్కబెట్టిన ఆయనకు ఇప్పుడు జనసేన అడికారికంగా పదవి అందించడంతో ఆయన మరింత దూకుడుగా పార్టీకి ఉపయోగపడే అవకాశం ఉంది.ఆర్థిక అండదండలు కూడా పుష్కలంగా ఉన్న వ్యక్తి కావడంతో ఇక తనదైన శైలి లో పార్టీ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేస్తారన్న విశ్లేషణలు ఉన్నాయి.

ఆయన ఒకప్పుడు పాలకొల్లు( Palakollu ) ఎమ్మెల్యే స్థానాన్ని కూడా ఆశించారని వార్తలు వచ్చాయి కానీ ఆయన పార్టీకి నిబద్ధతగల సైనికుడుగా తనవంతు సాయం చేస్తానని, తనకు రాజకీయ ఆకాంక్షలు ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రాధాన్యత సినిమా నిర్మాణం మాత్రమేనని కానీ ఖచ్చితంగా ఒక ఒక సమయం తర్వాత రాజకీయాల్లోకి వస్తానని ఆయన ప్రకటించడంతో ఆయన ప్రస్తుతం తెర వెనక మాత్రమే సహాయక సహకారం అందిస్తారని తెలుస్తుంది./br>

ఎన్నికల సమయం దగ్గరికి వస్తూ ఉండటంతో జనసేన పార్టీ కూడా ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులను కోసం అన్వేషిస్తుంది.ఇప్పటికే నిర్మాత బీవీఎస్ న్ ప్రసాద్( BVSN Prasad ) ను పార్లమెంట్ స్థానం కోసం తయారు చేస్తుండగా మరి కొంత మంది బలంగా ఉన్న అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభమైందట ఏది ఏమైనా తెలుగుదేశం తమకు కేటాయించే స్థానాలలో మెజారిటీని స్థానాలను గెలిపించుకొని ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాలని చూస్తున్న జనసేన ఈసారి అన్ని రకాల అన్ని రకాలుగానూ సిద్ధంగా ఉండాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube