ఈమధ్య సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతూ పోతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆన్లైన్ లో ఎన్నో నకిలీ వెబ్సైట్లు( Fake websites ) దర్శనం ఇస్తున్నాయి.
ఎంతోమంది నకిలీ వెబ్సైట్- ఒరిజినల్ వెబ్సైట్ మధ్య తేడాను గుర్తించలేక సైబర్ వలలో చిక్కుకుంటున్నారు.ఏదైనా వెబ్సైట్ ను చూస్తే అది ఒరిజినలా లేదంటే నకిలీదా అని తెలుసుకుంటే మంచిది.
కాబట్టి కొన్ని సూచనల ద్వారా ఒరిజినల్ వెబ్ సైట్( Original website ) ను ఎలా గుర్తించాలో టెక్ నిపుణులు చెబుతున్నారు.వాటికి సంబంధించిన వివరాలు ఏమిటో పూర్తిగా చూద్దాం.
ప్రస్తుతం మనిషి ఎలాంటి సమాచారం కావాలన్నా వెబ్సైట్ ద్వారా సర్చ్ చేసి తెలుసుకుంటున్నాడు.ఏదైనా వెబ్ సైట్ ఓపెన్ చేయాలంటే.ముందుగా ఆ వెబ్సైట్ కు సంబంధించిన అడ్రస్ డొమైన్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అని అందరికీ తెలిసిందే.కారణంగా వెబ్సైట్ నేమ్ చివర్లో .com, .org, .gov, Edu లాంటివే ఎక్కువగా ఉంటాయి.ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే నకిలీ డొమైన్ పేర్లు కాస్త తప్పుగా ఉంటాయి.
ఏదైనా వెబ్సైట్ నేమ్ లో URL ఉంటే కచ్చితంగా దీనికి ముందు HTTP అని ఉండాలి.అలా ఉంటేనే అది ఒరిజినల్ వెబ్సైట్.లేదంటే నకిలీ వెబ్సైట్.
ఇక నకిలీ వెబ్సైట్లను గుర్తించే మరో మార్గం ఏమిటంటే.వెబ్ సైట్ ఓపెన్ చేసిన వెంటనే మరో వెబ్సైట్ కి రీడ్ అవుతూ ఉందంటే కచ్చితంగా అది నకిలీ వెబ్సైట్ అయ్యే అవకాశం ఉంటుంది.అలాంటి వెబ్సైట్లో పట్ల చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఒరిజినల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే About US, contact పేజీలు కనిపిస్తాయి.నకిలీ వెబ్సైట్లో ఇలాంటి వివరాలు ఉండవు.
కాబట్టి ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే About US, contact లాంటి వాటిపై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.WEB OF TRUST అనే వెబ్ సైట్ ను ఉపయోగించి కూడా నకిలీ వెబ్సైట్లను గుర్తించవచ్చు.
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కు ఈ వెబ్సైట్ యాడ్ చేసుకుంటే.ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే దానిపై గ్రీన్ కనిపిస్తే ఒరిజినల్ అని, రెడ్ మార్క్ కనిపిస్తే నకిలీ వెబ్సైట్ అని సులభంగా గుర్తించవచ్చు.