తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) అప్పట్లో స్టార్ హీరో గా చాలా సంవత్సరాల పాటు వెలుగొందాడు.
ఆయన నటించిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలు అందుకున్నాయి.అయితే ఒకప్పుడు ఈయన బాలకృష్ణ, కృష్ణంరాజులతో కలిసి సుల్తాన్( Sultan ) అనే సినిమా చేశాడు.
ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది.అయిన కూడా ఈ సినిమా కోసం సూపర్ స్టార్ కృష్ణ చాలా పెద్ద రిస్క్ చేశాడు అంటూ అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి…
అయితే ఒక రోజు అడవిలో చేజింగ్ షూటింగ్ ఉండటం తో షూట్ చేయాల్సి వచ్చింది.ఇంకా ఆ టైం లో కృష్ణ కి అడవిలో కొన్ని చెట్లు గీరుకుపోయి కొన్ని గాయాలు కూడా అయినట్టుగా అప్పట్లో చిత్ర యూనిట్ తెలియజేసింది.అయిన కూడా ఆయన ఆ గాయాలు( Injuries ) అన్ని లెక్కచేయకుండా హాస్పిటల్ కి వెళ్లకుండా షూటింగ్ లో పాల్గొంటూ అసలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చాలా ఈజీగా షూటింగ్ ( Shooting ) కంప్లీట్ చేశాడు అంటూ ఆ చిత్ర నిర్మాత కృష్ణ గురించి అప్పట్లో చెప్పడం విశేషం…
ఇలా కృష్ణ ఒక సినిమాకి కమిట్ అయితే వాళ్ళు అనుకున్న రోజుకి సినిమా రిలీజ్ అవ్వడానికి తన వంతుగా తను చాలా ప్రయత్నం చేస్తాడు.అదేవిధంగా షూటింగ్ మాత్రం ఎక్కడ డిలే అవకుండా చూసుకుంటాడు అది కూడా తన వల్ల డిలే అయితే అతనికి నచ్చదు.అందుకే సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి చాలా ఆసక్తి ని చూపిస్తాడు…అందుకే కృష్ణ ని ప్రొడ్యూసర్స్ హీరో ( Producers Hero ) అని పిలిచేవారు అలాగే కృష్ణ గారంటే ఇండస్ట్రీ లో అందరికి చాలా గౌరవం కూడా ఉంటుంది…
.