కౌంటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanti ) సంబంధిత అధికారులకు సూచించారు.కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి పెండింగ్ పనులను మిషన్ మోడ్ లో పూర్తీ చేయాలన్నారు.

 Counting Arrangements Should Be Robust-TeluguStop.com

సోమవారం జిల్లా కలెక్టర్ తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో వేరు వేరుగా ఏర్పాటు చేస్తున్న సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను, పోలింగ్ తర్వాత భద్రపరిచే ఈవిఎం స్ట్రాంగ్ రూం లను అదనపు కలెక్టర్ లు ఎన్ ఖీమ్యా నాయక్, గౌతమ్ రెడ్డి, రిటర్నింగ్ అధికారులు ఆనంద్ కుమార్,మధు సూదన్ లతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ రూం లలో ఏర్పాట్లను పరిశీలించారు.

పరిశీలకులకు ప్రత్యేకించిన రూం లను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఆయా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

అన్ని విషయాల పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.

ఈ నెల 30 వ తేదీన ఎన్నికల పోలింగ్ కేంద్రాల తర్వాత ఈవిఎం లు బద్దెనపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రాలకు వచ్చినందున వాటిని నియోజకవర్గం వారిగా ప్రత్యేకించిన స్ట్రాంగ్ రూం లలో భద్రపరచాలని చెప్పారు.

స్ట్రాంగ్ రూం లను సీసి కెమెరా ల నిఘా లో పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలన్నారు.ఈసీఐ సూచనల మేరకు కౌంటింగ్ హాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలో ఆ విధంగా చేయాలన్నారు.

కౌంటింగ్ కేంద్రం( counting center ) లో అవుట్ ప్రకారం ఏర్పాట్లు కమ్యూనికేషన్ ప్లాన్ ఉండాలన్నారు.స్పీడ్ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు.ఒకవేళ ఇంటర్నెట్ పనిచేయకపోతే సమాచారం అందివ్వడంలో ఆలస్యం కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు.కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించడానికి గల నిబంధనలు, కౌంటింగ్ ఏజెంట్ల నియామక నిబంధనలను, అబ్జర్వర్ లకు సంబంధించి చేసుకోవాల్సిన ఏర్పాట్లు, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఎలా చేయాలి, ఆర్ ఓల బాధ్యతలు, మీడియా సెంటర్ ఏర్పాట్లు, సిసి కెమెరాల ఏర్పాటు, ఈవీఎం లను భద్రపరిచే స్ట్రాంగ్ రూం ఏర్పాట్లు , భద్రత చర్యలు, విడియో గ్రఫీ, ఫైర్ సేఫ్టీ చర్యలు, సిబ్బందికి భోజన సౌకర్యం తదితర విషయాల పై కలెక్టర్ అధికారులకు మార్గదర్శనం చేశారు.

ఓట్ల లెక్కింపు విధులు నిర్వహించే సిబ్బందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూముల వద్ద ఎలా ఉండాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు, వీడియోగ్రఫీ చేయడం, పటిష్ట భద్రత చర్యలు, తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.కౌంటింగ్ హాల్ కు ఎంట్రీ, ఎగ్జిట్ ఉండాలని రెండు వైపులా గార్డులను ఏర్పాటు చేయాలన్నారు.

ఆయా నియోజకవర్గాలకు సంబంధించి వాహన పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

మీడియా కవరేజీ చేయాల్సిన విధానం, మీడియా సెంటర్ లో చేయాల్సిన ఏర్పాట్ల పై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.

కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూం ల వద్ద పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో పంచాయితీ రాజ్ ఈ ఈ సూర్య ప్రకాష్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి శ్రీనివాస్, డీపీవో రవీందర్, డీపీఆర్ ఓ దశరథం ,సిరిసిల్ల, వేములవాడ తహశీల్దార్ లు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube