వీడియో: ప్రపంచంలోనే అత్యంత అందమైన గుర్రం ఇదే.. చూపు తిప్పుకోలేరు..

సాధారణంగా గుర్రాలు( Horse ) చాలా అందంగా ఉంటాయి.వాటన్నిటిలో అత్యంత అందమైన ఒక గుర్రం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 The Most Beautiful Horse In The World Akhal-teke Horse Video Viral Details, Akha-TeluguStop.com

ఇది అఖల్-టేకే( Akhal-Teke Horse ) అనే అరుదైన, అద్భుతమైన గుర్రపు జాతికి చెందింది.ఈ గుర్రం సూర్యుని కాంతిలో షైనీ గోల్డెన్ సిల్వర్ జుట్టుతో ఇంటర్నెట్‌ యూజర్లను ఆకర్షిస్తోంది.

ఈ జాతి తుర్క్‌మెనిస్తాన్‌లోని( Turkmenistan‌ ) కరాకుమ్ ఎడారికి చెందినది.ఈ గుర్రంలో చురుకుదనం, తెలివితేటలు ఎక్కువ.

అయితే ఎడారి పరిస్థితులకు ఇది అనుగుణంగా ఉంటుంది.

ట్విట్టర్‌లో గాబ్రియెల్ కార్నో అనే యూజర్ షేర్ చేసిన వీడియోలో అఖల్-టేకే గుర్రం తన అద్భుతమైన అందం, గోల్డెన్ కలర్ హెయిర్ చూపుతుంది.

ఈ వీడియోకు లక్ష దాకా వ్యూస్ వచ్చాయి.ఇది చూసినవారు గుర్రాన్ని ప్రశంసిస్తూ అనేక వ్యాఖ్యలు చేశారు.“ఇది అరుదైన అఖల్-టేకే తుర్క్‌మెన్ గుర్రపు జాతికి చెందినది.షైనీ కోటు వల్ల వీటిని గోల్డెన్ హార్స్( Golden Horse ) అనే నిక్ నేమ్ తో పిలుస్తారు.” అని క్యాప్షన్ జోడించారు.

అఖల్-టేకే జాతి ప్రపంచంలోని పురాతన, స్వచ్ఛమైన గుర్రపు జాతులలో ఒకటి, ఇవి క్రీస్తుపూర్వం 3,000 కాలం నుంచే ఉన్నాయని అంటారు.ఇది అరేబియా గుర్రానికి( Arabian Horse ) సంబంధించినదని నమ్ముతారు. 1.6-1.65 మీటర్ల ఎత్తుతో సన్నని, సొగసైన శరీరాకృతితో ఇవి చాలా అందంగా కనిపిస్తాయి.ఈ జాతి వేగంగా పరిగెత్తుతాయి.చాలా బలం కలిగి ఉంటాయి.దాని యజమాని పట్ల చాలా విశ్వాసాన్ని కనబరిస్తాయి.అఖల్-టేకే గుర్రాలు కొనడం కూడా కష్టమే.

ఎందుకంటే ఇవి చాలా ఖరీదైనవి.భారతదేశంలో ఒక్కొక్క గుర్రం కనీసం రూ.30 లక్షల వరకు ఉంటుంది.అవి చాలా అరుదు కాబట్టి ధర కూడా ఎక్కువే ఉంటుంది.

ఈ జాతికి చెందిన గుర్రాలు ప్రపంచవ్యాప్తంగా 7,000 కంటే తక్కువ ఉన్నాయి.

1924లో, అష్కాబాద్‌లో సంభవించిన వినాశకరమైన భూకంపం అనేక అఖల్-టేకే గుర్రాలు, వాటి యజమానులను చంపింది.1950లలో, రష్యన్లు మాంసం కోసం ఈ జాతిని వధించాలని భావించారు, కానీ తుర్క్మెన్ గుర్రపు సైనికుల బృందం వాటిని ఎడారిలో దాచిపెట్టి వారిని రక్షించింది.సంతానోత్పత్తి, వైవిధ్యం లేకపోవడం వల్ల ఈ జాతి జన్యుపరమైన సమస్యలను కూడా ఎదుర్కొంది.

నేడు, ఈ జాతిని తుర్క్‌మెన్ ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు రక్షిస్తున్నాయి.దాని ప్రత్యేక లక్షణాలు, వారసత్వాన్ని సంరక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube