సాధారణంగా కుక్కలు( dogs ) రాత్రిపూట బయటకు షికారుకు వెళ్లడానికి ఆసక్తి చూపుతుంటాయి.బయటకు పంపించమని యజమానులను అడుగుతాయి.
అయితే ఒక కుక్క మాత్రం యజమాని అనుమతి లేకుండా చడీ చప్పుడు కాకుండా ఇంటి నుంచి పారిపోయింది.అలా పారిపోయిన ఆ పెంపుడు జంతువు అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చి ఏమీ జరగనట్లుగా డోర్‌బెల్( doorbell ) మోగించింది.
దీనికి సంబంధించిన ఫన్నీ వీడియోను యజమాని పంచుకున్నాడు.ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలోని కుక్క ప్రవర్తన చాలా మంది సోషల్ మీడియా యూజర్లను ఆకట్టుకుంది.
ఆ వీడియోలో కుక్క ఇంటి ముందు తలుపు బయట నిల్చుని, మామూలుగా చుట్టూ చూస్తున్నట్లు కనిపించింది.తరువాత, అది తన పంజా పైకెత్తి, డోర్‌బెల్ నొక్కి, ఎవరైనా తలుపు త్వరగా తెరవండి అంటూ సైగలు చేసింది.మునుపటి రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కుక్క ఇంటి నుండి పారిపోయి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు తిరిగి వచ్చిందని వీడియోపై టెక్స్ట్ వివరించింది.“ఈ కుక్క వర్క్ నుంచి ఇంటికి వచ్చినట్లుగా ప్రవర్తించింది.” అని ఈ వీడియోపై పలువురు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వీడియోను పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్ దానికి “అది ఒక లాంగ్ షిఫ్ట్” అని క్యాప్షన్ ఇచ్చారు.ఈ వీడియో నెటిజన్ల నుంచి చాలా రియాక్షన్‌లను అందుకుంది.కుక్క ఎక్కడ ఉంది? అది ఇంట్లో లేనప్పుడు ఏమి చేస్తుందో? కొంపదీసి ఏదైనా డిటెక్టివ్ జాబ్ చేస్తుందా అని కొందరు ఫన్నీగా వ్యాఖ్యానించారు.మరికొందరు కుక్క డోర్ బెల్ మోగించేంత తెలివిగా ఉందని, తలుపు గీకడం లేదా మొరగడం చేయలేదని ప్రశంసించారు.“రాత్రంతా పార్టీ చేసుకుని ఇంటికి వచ్చినట్లు కనిపిస్తోంది.” అని మరొక వినియోగదారు చమత్కరించారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.