పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీ ( Janasena party ) అధినేతగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలుపొందాలని ఈయన పెద్ద ఎత్తున రాజకీయాలలో చాలా చురుగ్గా ఉంటున్నారు.
ఇక చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో తన జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకొని వచ్చే ఎన్నికల బరిలోకి దిగబోతున్నారని తెలుస్తుంది.ఇప్పటికే తెలుగుదేశం జనసేన పార్టీలో కలిసి రాష్ట్ర రాజకీయాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని ఎంతోమంది కూడా కోరుకుంటున్నారు అయితే పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్( Renu Desai ) చాలా రోజుల తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రేణు దేశాయ్ ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరయ్యి తన వ్యక్తిగత విషయాలతో పాటు తన గత విషయాల గురించి కూడా ఈమె మాట్లాడారు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఎక్కువగా పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఇష్టపడటం లేదు అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు అన్న ప్రశ్న ఎదురయింది.
ఈ ప్రశ్నకు ఈమె షాకింగ్ సమాధానం చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా రేణు దేశాయ్ మాట్లాడుతూ ఒక మంచి పొలిటీషియన్ గా పవన్ కళ్యాణ్ సొసైటీకి ఎంతో అవసరం అని నేను గత వీడియోలలో తెలియజేశాను.అది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని తెలిపారు.ఇక ఆయన సీఎం( Pawan Kalyan CM ) అవ్వాలని నేను కోరుకోను.
సీఎం అవ్వడం కాకపోవడం అనేది దైవ నిర్ణయం అని దేవుడు ఎప్పుడు ఏం జరగాలో అది జరిగేలా చేస్తారు అంటూ ఈ సందర్భంగా రేణు దేశాయ్ తెలిపారు.ఒక కామన్ మ్యాన్ గా కూడా నేను పవన్ కళ్యాణ్ పట్ల స్టాండ్ తీసుకోను అంటూ రేణు దేశాయ్ ఈ సందర్భంగా ఆయన పొలిటికల్ జర్నీ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.