అధికార ప్రతినిధులకు పవన్ కీలక సూచనలు..!!

మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ( Janasena ) అధినేత పవన్ ( Pawan Kalyan )అధికార ప్రతినిధులకు కీలక సూచనలు చేశారు.ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు.

 Pawan Kalyan Key Instructions For The Janasena Representatives Janasena, Pawan K-TeluguStop.com

ఈ సందర్భంగా వచ్చే నెలలో వర్క్ షాప్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.వచ్చే ఎన్నికలలో అధికార ప్రతినిధుల పాత్ర ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో చర్చలలో వ్యక్తిగత అభిప్రాయాలు దూషణాలకు వెళ్లకుండా పార్టీ విధానాలకు కట్టుబడి మాట్లాడాలని సూచించారు.కులాలు మరియు మతాల గురించి మాట్లాడాల్సి వస్తే రాజ్యాంగానికి లోబడి మాత్రమే మాట్లాడాలని సూచించారు.

అన్ని మతాలను ఒకేలా గౌరవించాలని.చర్చి, దేవాలయం, మసీదులపై దాడులు జరిగితే ఒకేలా స్పందించాలని అన్నారు.

అనవసర విషయాలు ఇంకా వ్యక్తిగత దూషణలు సమాజాన్ని హాని చేసే విధంగా చర్చలు ఉండకూడదని పేర్కొన్నారు.అంతేకాకుండా సోషల్ మీడియాకు అనవసరమైన ఇంటర్వ్యూలు ఇవ్వద్దని పేర్కొన్నారు.

వాటి వల్ల కొన్నిసార్లు లేనిపోని అనుమానాలకు తావిచ్చే ప్రమాదం ఉందని అధికార ప్రతినిధులను పవన్ హెచ్చరించారు.సోషల్ మీడియా( Social media )లో వచ్చిన ఒక సమాచారాన్ని నిర్ధారించుకోకుండా మరి కొందరికి ఫార్వర్డ్ చేయడమే, దానిపై హడావుడి చేయడమో వద్దని తెలిపారు.

పార్టీ ప్రతినిధిగా ఉంటూ సోషల్ మీడియాలో వ్యక్తిగత పోస్టులు పెట్టవద్దని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube