వేపుడు శనగపప్పు, బెల్లం.ఈ రెండూ విడి విడిగా ఎంతో రుచిగా ఉంటాయి.ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి.అందుకే ఆరోగ్య పరంగా బోలెడన్ని ప్రయోజనాలను కలిగిస్తాయి.అయితే వేపుడు శనగపప్పు, బెల్లంను వేటికవే కాకుండా కలిపి తీసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు.ఈ రెండిటినీ కలిపితే రుచి రెట్టింపు అవ్వడమే కాదు.
పోషకాలు రెట్టింపు అవుతాయి.అందుకే వేపుడు శెనగపప్పును బెల్లంతో కలిపి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు ప్రతి రోజు ఓ గుప్పెడు వేపుడు శెనగపప్పును బెల్లం ముక్కతో కలిపి తీసుకోవాలి.ఇలా చేస్తే అతి ఆకలి తగ్గుతుంది, చిరు తిండ్లపై మనసు మల్లకుండా ఉంటుంది, శరీరంలో కొవ్వూ కరుగుతుంది.
తద్వారా వెయిట్ లాస్ అవుతారు.అలాగే ప్రస్తుత రోజుల్లో కోట్లాది మంది రక్తహీనత సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారు.
అలాంటి వారు వేపుడు శెనగపప్పు, బెల్లం కలిపి తీసుకుంటే.శరీరానికి పుష్కలంగా ఐరన్ అందుతుంది.
ఫలితంగా రక్త హీనత సమస్య పరార్ అవుతుంది.మెదడు చురుకుదనాన్ని పెంచడంలోనూ ఈ రెండిటి కాంబినేషన్ అద్బుతంగా సహాయపడుతుంది.
అవును, వేయించిన శనగ పప్పుకు బెల్లం కలిపి తింటే బ్రెయిన్ షార్ప్‌గా మారుతుంది.ఆలోచన శక్తి, ఏకాగ్రత రెండూ పెరుగుతాయి.
అల్జీమర్స్ వంటి ప్రమాదకరమైన వ్యాధి వచ్చే రిస్క్ తగ్గుతుంది.

అంతే కాదు.బెల్లం, వేయించిన శనగలు కలిపి తింటే జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.మలబద్ధకం దూరం అవుతుంది.
గుండె ఆరోగ్య వంతంగా మారుతుంది.దంతాలు దృఢత్వం పెరుగుతుంది.
మరియు కండరాలు సైతం బలంగా మారతాయి.కాబట్టి.
ఫాస్ట్ ఫుడ్స్, నూనెలో వేయించిన ఆహారాలు తినే బదులు శనగపప్పుకు బెల్లం కలిపి తీసుకుంటే పైన చెప్పిన ప్రయోజనాలన్నీ తమ సొంతం చేసుకోవచ్చు.