కృష్ణాజిల్లా కంకిపాడులోని మణప్పురం ఫైనాన్స్( Manappuram Finance ) సంస్థలో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యారు.ఈ చోరీ వెనక మేనేజర్ తో పాటు మరొక వ్యక్తి హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.కంకిపాడు ఎస్సై కె.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.కృష్ణాజిల్లా గుడివాడలోని లింగవరం గ్రామానికి చెందిన రెడ్డి వెంకట పావని (30)( Reddy Venkata Pavani ) ఓ ఏడాది నుండి కంకిపాడులో ఉండే మణప్పురం ఫైనాన్స్ సంస్థ బ్రాంచ్ హెడ్ గా పనిచేస్తుంది.
ఈ బ్రాంచ్ లో 1477 మంది ఖాతాదారులు దాదాపుగా 16 కిలోల బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు పొందారు.
సోమవారం రాత్రి వరకు విధులు నిర్వహించిన బ్రాంచ్ హెడ్ పావని, మంగళవారం విధులకు హాజరు కాలేదు.అయితే కొందరు ఖాతాదారులు తాము తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను( Gold Jewelry ) విడిపించుకునేందుకు బ్రాంచ్ కు వచ్చారు.ఖాతాదారులు ఇచ్చినా రశీదుల ప్రకారం చూడగా.
బ్రాంచ్ లో ఆభరణాలు కనిపించలేదు.దీంతో బ్రాంచ్ లో ఉండే సిబ్బంది ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వడంతో పూర్తి స్థాయిలో బ్రాంచ్ లోని రికార్డులను పరిశీలించిన ఉన్నత అధికారులు మంగళవారం అర్ధరాత్రి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో విచారణ జరపగా బ్రాంచ్ లో 951 మంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన 10.660 కిలోల బంగారు ఆభరణాలు కనిపించడం లేదని తేలింది.బహిరంగ మార్కెట్లో ఈ ఆభరణాల విలువ సుమారుగా రూ.6 కోట్లకు పైగానే ఉంటుంది.మణప్పురం ఫైనాన్స్ సంస్థలో 10 కిలోలకు పైగా బంగారం చోరీకి గురైనట్లు కంకిపాడు చుట్టుపక్కల తెలియడంతో ఖాతాదారులలో తీవ్ర ఆందోళన నెలకొంది.రెండు నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసిన ఉన్నత అధికారులు పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి.
మణప్పురం ఆఫీస్ కింద ఉండే షాపుల సీసీ కెమెరాలలో నమోదైన దృశ్యాలు పోలీసుల విచారణకు సహాయపడ్డాయి.ఈ బంగారు ఆభరణాల చోరీ వెనుక బ్రాంచ్ హెడ్ రెడ్డి వెంకట పావని హస్తం ఉందని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలిస్తున్నారు.