మిస్సయిన కాలిఫోర్నియా మహిళ.. దానికి ముందు రికార్డు అయిన షాకింగ్ వీడియో వైరల్..

కాలిఫోర్నియాకు చెందిన చెల్సియా గ్రిమ్ ( Chelsea Grimm )అనే 32 ఏళ్ల మహిళ 2023, అక్టోబర్ 4న అదృశ్యమయింది.మిస్ అవ్వడానికి ముందు ఆమె తన పెంపుడు జంతువువైన ఓ పెద్ద బల్లితో కలిసి రోడ్ ట్రిప్‌ ప్రారంభించింది.

 Missing California Woman Shocking Video Recorded Before That Goes Viral , Chelse-TeluguStop.com

ఆమె పెళ్లికి వెళ్లాలని ప్లాన్ చేసింది.కానీ డ్రాగన్‌ లిజార్డ్‌ను విమానంలోకి అనుమతించలేదు.

దాంతో ఆమె విమానంలో ప్రయాణం చేయలేకపోయింది.బదులుగా అరిజోనాలో క్యాంప్ చేయాలని నిర్ణయించుకుంది, ఆపై తిరిగి కాలిఫోర్నియాకు వెళ్లింది.

ఆ తర్వాత ఆమె ఎక్కడికి పోయింది ఎలా ఉంది అనే వివరాలు తెలియ రాలేదు.తల్లిదండ్రులు ఆమెను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించారు కానీ ఫలితం లేకపోయింది, ఆమె మిస్ అయిందని పోలీసులకు ఫిర్యాదు కూడా అందించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఆచూకీ కోసం వెతుకుతూ అరిజోనాలోని యాష్‌ఫోర్క్ సమీపంలో ఆమె కారును అక్టోబర్ 5న కనుగొన్నారు.కారు తాళం వేసి, టైర్లు పగిలి ఉన్నాయి.

ఆమె డ్రాగన్ బల్లి, ఆమె వస్తువులు కారులో లేవు.

సెప్టెంబర్ 28న అరిజోనా( Arizona )లోని విలియమ్స్‌లో చెల్సియా గ్రిమ్ ఒక పోలీసుతో మాట్లాడుతున్న బాడీ క్యామ్ వీడియోను కూడా పోలీసులు కనుగొన్నారు.ఆ వీడియోలో ఒక పోలీసు అధికారి స్మశాన వాటిక దగ్గర ఆమె కారును చూసి ఇక్కడ ఎందుకు ఉన్నారు అని ఆమెను అడిగారు.ఆరోగ్యం బాగుందా, మీరు ఓకేనా అని ఆమె బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు.

చనిపోయిన సైనికుల ఫోటో షూట్ చేస్తుండగా బాగా ఎమోషనల్ అయ్యానని, అందుకే ఏడుస్తున్నానని చెల్సియా తెలిపింది.హోటల్ రూమ్ బుక్ చేయలేదని, రాత్రికి అక్కడే క్యాంప్ చేయాలనుకుంటున్నానని చెప్పింది.

అయితే అది సురక్షితం కాదని, పక్కనే ఉన్న గ్యాస్ స్టేషన్ లో క్షేమంగా పడుకోవచ్చని పోలీసు అధికారి సలహా ఇచ్చారు.దానికి ఆమె కృతజ్ఞతలు కూడా తెలిపింది./br>

చెల్సియా డేటింగ్ చేస్తున్న అబ్బాయి ఆమెను బెదిరిస్తున్నాడని, అందుకే భయపడి అతడి నుంచి పారిపోయేందుకు ఇలా బయటికి వెళ్లి ఉండొచ్చని తండ్రి చెప్పాడు.ఇది ఆమె మనస్సును ప్రభావితం చేసి ఉండవచ్చని అతను వివరించాడు.ఇప్పటివరకైతే పోలీసులు ఆమెకు చెడు జరిగిందని ఎలాంటి ఆధారాలు కనుగొనలేదు.అందువల్ల కుటుంబ సభ్యులు ఆమె ఎక్కడో ఒక చోట సురక్షితంగా ఉంటుందని ఆశిస్తున్నారు.ఆమెను త్వరగా కనుగొనాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube