రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ ఆర్యవైశ్య 9 అభ్యుదయ సంఘాలు, అనుబంధ సంఘాలు,మహిళా సంఘాల ఆధ్వర్యంలో గురువారం రాత్రి వేములవాడ పట్టణం శ్రీనివాస కళ్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు.ముఖ్యఅతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారుఅందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని వారన్నారు.
ఎవరికైనా ఆపద వచ్చిందంటే ముందుండి ఆ సమస్యను పరిష్కరించడంలో నేను ముందుంటానని వారన్నారు.నాలుగు సార్లు ఓడిన ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ఉన్నాను.
ఒక్కసారి గమనించండి అధికార పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థి ఈ ప్రాంతం వారే కాదు కాబట్టి ఒక్కసారి ప్రజలారా గమనించండి.ఒక్క అవకాశం ఇవ్వండి నేను లోకల్ మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని ఈసారి కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తు పైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరిని వేడుకుంటున్నాను అని వారన్నారు.
ఆదికి అండగా నిలబడడానికి ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు పేరుపేరునా మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు భవిష్యత్తులో మీ అందరికీ నేను అండగా నిలబడతా… మీ కష్టసుఖాలలో పాలుపంచుకుంటా,ఆపదలో ఉన్న ఆదికి… ఆర్యవైశ్యులు అండగా నిలవాలని చేతులు జోడించి వేడుకుంటున్నాను అని వారన్నారు.
ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బాసెట్టి రవీందర్, సంఘ నాయకులు చికోటి నాగరాజు, దైతా కుమార్, నగుపోతు రవీందర్, ఎర్ర శ్రీనివాస్, కట్కం కిషన్ కటకం జనార్ధన్, సిద్ధంశెట్టి వేణు, కొత్త అనిల్, నరాల శ్రీనివాస్, సౌజన్య, చికోటి జ్యోతి, జోష్ణ ,గంప మారుతి, సనుగుల కిషన్, బాశెట్టి శ్రీనివాస్, బచ్చు వెంకటేశం, సామ వీర రమణ, జిల్లా రమేష్, బూర్ల విటల్, తదితరులు పాల్గొన్నారు.