బాలీవుడ్ ( Bollywood )ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న టువంటి వారిలో నటుడు అమితాబ్ బచ్చన్( Amithab Bachchan ) ఒకరు.ఈయన సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరోగా నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయన ఇప్పటికీ స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.1970 వ సంవత్సరంలో తన సినీ కెరియర్ ప్రారంభించినటువంటి ఆయన ఇప్పటికీ తెలుగు హిందీ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
అమితాబ్ అక్టోబర్ 11, 1942వ సంవత్సరంలో ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జన్మించారు.ఇక ఈయన 81 వ సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో ఈయన పుట్టినరోజు సందర్భంగా తనకు సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక ఈయన పుట్టినరోజు సందర్భంగా మరోసారి అమితాబచ్చన్ ఆస్తుల గురించి ఆయన ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంత మొత్తంలో సంపాదించారనే విషయాల గురించి ఒక వార్త వైరల్ గా మారింది.
అమితాబ్ ప్రస్తుత ఆస్తులు విలువ ఎంత ఏంటి అనే విషయానికి వస్తే….
సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈయన కెరియర్ మొదట్లో 500 రూపాయల రెమ్యూనరేషన్ అందుకొని తన కెరియర్ ప్రారంభించారు.ఇలా 500తో మొదలైన తన సినీ ప్రస్థానం కొన్ని వందల కోట్ల రూపాయలను సంపాదించే స్థాయికి వెళ్లిందని చెప్పాలి.ఈయన ఒక్కో సినిమాలో ప్రస్తుతం నటించడానికి 5 నుంచి10 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ( Remuneration )అందుకుంటున్నారు.
ఇక పలు నివేదికల ప్రకారం అమితాబ్( Amithab Bachchan ) ప్రస్తుత ఆస్తులు విలువ సుమారు 3,600 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది.వీటితో పాటు మరికొన్ని స్టార్టప్ కంపెనీలలో ఈయన పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇక ఈయన ఏడాదికి సుమారు 50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నారు.వీటితో పాటు ముంబైలోని కొన్ని ప్రాంతాలలో ఖరీదైన బంగ్లాలు కూడా ఉన్నాయి.