టీడీపీ నేత బోండా ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీలో అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదని పేర్కొన్నారు.
లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలంటూ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
ఇన్నర్ రింగ్ అలైన్ మెంట్ లో హెరిటేజ్ భూములే కోల్పోతున్నారని బోండా ఉమ తెలిపారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రస్తావన లేనప్పుడే హెరిటేడ్ సంస్థ భూములు కొనుగోలు చేసిందని పేర్కొన్నారు.ఆ సమయంలోనే ప్రజల నుంచి సీఆర్డీఏ అభ్యంతరాలు స్వీకరించిందన్నారు.
అలైన్ మెంట్ లో ఎక్కడా తప్పిదాలు జరగలేదని వెల్లడించారు.కోర్టుల్లో చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులు నిలబడవని స్పష్టం చేశారు.