గత కొద్దిరోజులుగా తెలంగాణ సీఎం కేసీఆర్( CK KCR ) బయటకు కనిపించడం లేదు.దీనిపై తెలంగాణ బిజెపి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
కీలకమైన ఎన్నికల సమయంలో కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు ? ప్రధాని నరేంద్ర మోది స్వయంగా తెలంగాణకు వచ్చి కేసీఆర్ పైన, తెలంగాణ ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేసిన వాటిని తిప్పుకొట్టేందుకు కేసిఆర్ ఎందుకు ఆసక్తి చూపించడం లేదని, అసలు కెసిఆర్ కు ఏమైంది అనే ప్రశ్నలు తెలంగాణ బిజెపి నాయకుల్లో వ్యక్తం అవుతున్నాయి.గత 20 రోజులుగా కేసీఆర్ బయటకు కనిపించడం లేదని, ఆయన హెల్త్ బులిటెన్ ప్రకటించాలని బిజెపి ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్ లు కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు .
కొద్ది రోజుల క్రితం కేసీఆర్ కి వైరల్ ఫీవర్ వచ్చిందని, ఆయనకు ఐదుగురు వైద్యుల పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నామని కేటీఆర్ ట్వీట్ చేశారు.ఆ తర్వాత నుంచి ఏ సమాచారం బయటకు రాకపోవడం, అన్ని వ్యవహారాలను కేటీఆర్, హరీష్ రావు ,కవితలు చక్కబెడుతూ ఉండడంతో, రాజకీయ వర్గాలలోను అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రెండుసార్లు వచ్చి బీఆర్ఎస్( BRS PARTY ) టార్గెట్ చేసుకుని విమర్శలు చేసినా, కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించకపోవడం, ఆ విమర్శలను తిప్పికొట్టకపోవడం పై బిజెపి అనుమానాలు వ్యక్తం చేస్తుంది .
ముఖ్యంగా బండి సంజయ్ ( Bandi Sanjay )ఈ వ్యవహారంపై పదే పదే స్పందిస్తున్నారు.మా ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించడం లేదని మాకు మంత్రి కేటీఆర్ పైనే అనుమానంగా ఉందని సంజయ్ సెటర్లు వేస్తున్నారు.సీఎం కేసీఆర్ కు ఏమైంది ? కేటీఆర్ ఏమైనా చేసిండా లేక ఏమైనా ఇబ్బంది పెడుతుండా అనే అనుమానం కలుగుతుందని, ఎందుకంటే ఆయన మా సీఎం అని, ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని, మా సీఎం కేసీఆర్ తో మీడియా సమావేశం పెట్టించాలని , అప్పుడే ఆయన క్షేమంగా ఉన్నారని మేము నమ్ముతామని బండి సంజయ్ చెబుతున్నారు.రేపు ఆరో తేదీన కెసిఆర్ స్కూల్ పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంది .ఈ కార్యక్రమం కెసిఆర్ చేతుల మీదుగా జరగకపోతే బిజెపి చేస్తున్న విమర్శలతో జనాల్లోనూ అనుమానాలు రేకెత్తే అవకాశం లేకపోలేదు.