అవిసె గింజల రోటిని తింటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..!

అవిసె గింజలను( Flax seeds ) పోషకాల నిధిగా పిలుస్తూ ఉంటారు.మనం అనేక విధాలుగా మన ఆహారంలో అవిస గింజలను ఉపయోగించవచ్చు.ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, అధిక ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్లు అవిసె గింజలలో ఎక్కువగా ఉంటాయి.ఇవి మానవ శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

 There Are So Many Health Benefits Of Eating Flax Seed Roti , Flax Seeds ,omega--TeluguStop.com

అయితే మీరు ఎప్పుడైనా అవిసె గింజల రొట్టెలను తిన్నారా? అవిసె గింజల రొట్టె ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చు.అవిస గింజల రోటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే అవిసె గింజల రొట్టెలను తయారు చేయడానికి కావలసిన పదార్థాలు గోధుమ పిండి, ( Whole Wheat Flour ) అవిసె గింజలు, రుచికి సరిపడా ఉప్పు,నెయ్యి ఉండాలి.అలాగే అవిసె గింజల రోటి చేయడానికి ముందుగా అవిసె గింజలను రుబ్బుకొని పొడి చేసుకోవాలి.ఒక గిన్నెలో గోధుమ పిండి రుబ్బిన అవిసె గింజలు, ఉప్పు, నెయ్యి వేసి పిండిని కలుపుకోవాలి.పిండిని కొన్ని నిమిషాలు నానబెట్టాలి.రోటీలను రెగ్యులర్ రోటిలాగా చేసుకోవాలి.నాన్ స్టిక్ పాన్ మీద రోటీలను రెండు వైపులా బాగా కాల్చాలి.

దీన్ని ప్లేట్లో తీసుకొని ఏదైన కూరగాయలతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

అవిసె గింజల రొట్టె మధుమేహ రోగులకు( diabetic patients ) ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.అలాగే ఇది చక్కెరను కూడా అందులో ఉంచుతుంది.ఇంకా చెప్పాలంటే అవిసె గింజల రొట్టె గుండెకు కూడా ఎంతో మేలు చేస్తుంది.

ఇది గుండెను ఆరోగ్యంగా( Heart healthy ) ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.అవిసె గింజలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు కూడా ఉంటాయి.

ఇవి మల బద్దకం( Constipation ) నుంచి ఉపశమనం పొందడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.మీరు బరువు తగ్గాలనుకుంటే మీ ఆహారంలో ఈ రోటిని చేర్చుకోవడం ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube