ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను కేంద్ర అధికార పార్టీ ప్రకటించినప్పుడే రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పార్టీ ఏదో సంచలన నిర్ణయాలు తీసుకుంటుందని ప్రతిపక్షాలు అనుమానించాయి.వారి అనుమానం నిజమే అన్నట్టుగా మోడీ పరివారం ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది జమిలి ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తారని, మహిళా బిల్లును రంగంలోకి తీసుకొస్తారని ఇలా అనేక ఊహాగానాలు చెలరేగుతున్నప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వ ఆలోచనపై ఎటువంటి లీకులు బయటకు రాలేదు.
అయితే నిన్న సాయంత్రం జరిగిన కేంద్ర క్యాబినెట్ బేటిలో మహిళా బిల్లు ఆమోదం పొందినట్లుగా తెలుస్తుంది.దాంతో భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చారిత్రక ఘట్టానికి మోడీ ప్రభుత్వం తెర తీసినట్లయ్యింది .నిన్న పార్లమెంట్ ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాన మోడీ( Narendra Modi ) సంచలన నిర్ణయాలు తప్పవని హెచ్చరించడం ద్వారా ప్రతిపక్షాలకు భారీ ఎత్తున షాక్ ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.

రేపటి నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగుతాయని తెలిపిన మోడి , పాత పార్లమెంట్ భవనం అనేక చారిత్రక సంఘటనలకు సాక్షి భూతంగా నిలిచిందని చెప్పుకొచ్చారు . ఆర్టికల్ 370 రద్దు ,జిఎస్టి ఏర్పాటు, ఒకే దేశం ఒకే పెన్షన్ వంటి కీలకమైన నిర్ణయాలకు ఈ పార్లమెంట్ వేదికగా తీసుకున్నామని అంతేకాకుండా గత ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలకు కూడా ఇదే పార్లమెంట్ భవనం సాక్ష్యంగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ విభజనను ఉద్దేశించి మోడీ మాట్లాడారు.

భాజపా హయాములో మూడు రాష్ట్రాలను విభజించినప్పటికీ ఇరు పార్టీల ప్రజలు సంతోషంతో అంగీకరించారని, ఆంధ్ర ప్రదేశ్ లో విషయం లో మాత్రం ఒక వర్గానికే సంతోషం దక్కిందని, తల్లి ని చంపి బిడ్డను తీసినట్టుగా చేశారని ప్రభుత్వాలు ముందుచూపుతో వ్యవహరించకుంటే ఇలాంటి పరిణామాలే జరుగుతాయి అంటూ ఆయన చెప్పుకొచ్చారు.అయితే ఉన్నట్టుండి మోడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని ఎత్తుకోవడంతో ఈ దిశగా ఏమైనా ప్రకటన చేయబోతున్నారా అంటూ కూడా చర్చ జరుగుతుంది అంతేకాకుండా సంచలన నిర్ణయాలు జరుగుతాయి అంటూ మోడీ కూడా కన్ఫర్మ్ చేయడంతో అవి ఏమై ఉంటాయా అంటూ దేశవ్యాప్తంగా మీడియాలో పెద్ద చర్చ జరిగింది .మరి రేపు నూతన పార్లమెంట్లో జరగబోయే సమావేశాల సందర్భంగా మహిళా బిల్లు( Womens Reservation Bill ) ఉభయ సభలు ముందుకు పెడతారనే వార్తలు వస్తున్నాయి.మరి మోదీ ప్రభుత్వం ఇస్తున్న షాక్ ను ప్రతిపక్ష కూటమి ఎలా ఎదుర్కొంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది
.