సింగపూర్ : దేవాలయమన్న విజ్ఞత లేక.. మహిళ చెంప పగులగొట్టి, భారత సంతతి లాయర్‌పై అభియోగాలు

పవిత్రమైన దేవాలయం ఆవరణలో మహిళను చెంపపై కొట్టి, అసభ్యంగా ప్రవర్తించిన భారత సంతతి లాయర్‌పై సింగపూర్ పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో శ్రీ మరియమ్మన్ ఆలయం( Sri Mariamman Temple ) వద్ద మహిళ చెంపపై నిందితుడు రవి మాడసామి( Ravi Madasamy ) కొట్టాడు.

 Indian-origin Lawyer Charged In Singapore For Slapping Woman In Temple Details,-TeluguStop.com

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని శనివారం నాలుగు అభియోగాలు నమోదు చేశారు.రవి మాడసామి గతంలోనే లాయర్ ప్రాక్టీస్ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యాడు.

అసభ్య పదజాలంతో దూషించడం, వేధింపులు వంటి ఇతర కౌంట్లపై కూడా అభియోగాలు నమోదు చేశారు.గడిలో వున్న మరో మహిళను వేశ్య అని పిలిచి ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు.

అంతకుముందు పగోడా స్ట్రీట్‌లోని ఓ వ్యక్తిని తమిళంలో అసభ్యపదజాలంతో దూషించాడు.

శనివారం వైద్య పరీక్షల అనంతరం రవి మాడసామిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్‌కు( Institute Of Mental Health ) తరలించారు.ఈ నెల 29న అతనిని కోర్ట్ ఎదుట హాజరు పరుస్తారని ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది.20 ఏళ్లుగా లాయర్‌గా వున్న రవి. ప్రస్తుత అటార్నీ జనరల్, అటార్నీ జనరల్ ఛాంబర్స్, లా సొసైటీకి చెందిన అధికారులపై అనుచితంగా ప్రవర్తించడం, నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు ఐదేళ్ల సస్పెన్షన్‌ను అనుభవిస్తున్నారు.అప్పీల్ కోర్ట్ 2020లో తన క్లయింట్ మరణశిక్షను రద్దు చేసిన తర్వాత.

రవి ఫేస్‌బుక్‌లో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

Telugu Indian Origin, Law Shanmugam, Ravi Madasamy, Singapore, Srimariamman, Tem

భారత సంతతికి చెందిన న్యాయశాఖ మంత్రి కె.షణ్ముగానికి( Law Minister K Shanmugam ) పరువు నష్టం కలిగించారని డిసెంబర్ 2020లో అతనిపై అభియోగాలు మోపారు.అయితే అటార్నీ జనరల్ ఛాంబర్స్ తర్వాత ఆ అభియోగాన్ని ఉపసంహరించుకుంది.

దీనికి బదులుగా రవికి షరతులతో కూడిన వార్నింగ్ ఇచ్చినట్లు ఛానెల్ న్యూస్ ఏషియా పేర్కొంది.న్యాయవాదిగా అతని ప్రాక్టీస్‌పైనా ఆంక్షలు విధించారు.న్యాయమూర్తి పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు 2007లో సస్పెన్షన్, తోటి న్యాయవాది, లా ప్రెసిడెంట్‌పై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు

Telugu Indian Origin, Law Shanmugam, Ravi Madasamy, Singapore, Srimariamman, Tem

రెండేళ్ల పాటు ప్రాక్టీస్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయకుండా నిషేధం వున్నాయని 2016లో సొసైటీ నివేదిక పేర్కొంది.ఇకపోతే.సింగపూర్ చట్టాల ప్రకారం. బహిరంగ ప్రదేశాల్లో క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించే వారికి 1000 సింగపూర్ డాలర్ల జరిమానా, ఒక నెల వరకు జైలు శిక్ష విధిస్తారు.

ఇది మరలా పునరావృతమైతే 2000 సింగపూర్ డాలర్ల జరిమానా, ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రెండూ వుంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube