తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నయంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) ఒకరు ఈయన చేసిన సినిమాల విషయం పక్కన పెడితే ఆయన స్వయంగా ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి హీరో గా చేస్తూ మంచి సక్సెస్ లు అందుకుంటున్నాడు.నిజానికి ఈయన చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయినప్పటికీ ఈయన వరుసగా సినిమాలు చేయడానికి కారణం ఏంటంటే ఆ సినిమాలు ప్లాప్ అయినప్పటికీ వాటికీ పెట్టిన బడ్జెట్ తిరిగి వస్తుంది కాబట్టి అందుకే ఈయన కి ఇక్కడ ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి అని చెప్పాలి.
నిజానికి ఈయన చేస్తున్న సినిమాలు ఈ జనరేషన్ లో ఉన్న చాలా మంది హీరోలకి సాధ్యంకాని రేంజ్ లోవరుస సినిమాలు చేస్తున్నాడు అయితే కిరణ్ అబ్బవరం ఇప్పుడు బేబీ మూవీ( Baby Movie ) డైరెక్టర్ అయిన సాయి రాజేష్ తో( Director Sai Rajesh ) ఒక సినిమా చేయబోతున్నాడు అనే టాక్ వినిపిస్తుంది…సాయి రాజేష్ మళ్లీ ఓ యూత్ ఫుల్ సినిమా తీయడానికి రెడీ అయినట్లు గా తెలుస్తుంది అందులోభాగం గానే ఆయన కిరణ్ అబ్బవరం తో ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా హిట్ అయితే సాయి రాజేష్ కూడా టాప్ డైరెక్టర్ లిస్ట్ లోకి చేరిపోతాడు.ఇక ఈ సినిమా కనక ఉంటె కిరణ్ అబ్బవరం కి కూడా మంచి మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది అనడం లో ఎంత మాత్రం సందేహం లేదనే చెప్పాలి…ఆల్రెడీ ఈనెలలోనే కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్( Rules Ranjan Movie ) అనే సినిమా కూడా రిలీజ్ కి రెడీ అయింది ఇప్పటికే ఈ సినిమా కి సంభందించిన ట్రైలర్ వచ్చింది మంచి రెస్పాన్స్ కూడా అందుకుంటుంది ఈ సినిమాతో కిరణ్ కి హిట్ పక్క అని చాలా మంది చెప్తున్నారు…