జమిలి ఎన్నిక వస్తే తెలంగాణ బిజెపి వ్యూహం ఫెయిలైనట్టేనా..?

ప్రస్తుతం దేశమంతటా ఏం నడుస్తుందయ్యా అంటే ఎన్నికల కోలాహళం నడుస్తుందని చెప్పవచ్చు.కొన్ని నెలల్లో ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్న తరుణంలో ఇప్పటికే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.

 If Jamili Gets Elected, Will The Telangana Bjp's Strategy Fail , Jamili Electi-TeluguStop.com

ఆ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు.ఇక తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ఇప్పటికే వారి యొక్క అభ్యర్థులను ఆల్మోస్ట్ ప్రకటించింది.

కాంగ్రెస్ రకరకాల వ్యూహాలు వేసుకుంటూ ముందుకు వెళ్తోంది.ఇదే తరుణంలో బిజెపి కూడా తెలంగాణలో గట్టిగా సీట్లు సంపాదించాలని ప్రత్యేక ఆలోచనలు కూడా చేస్తోంది.

Telugu Assembly, Bandi Sanjay, Etela Rajender, Jamili, Telangana-Politics

ఈ తరుణంలోనే కీలక నేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని బిజెపి ( BJP ) అధిష్టానం అల్టిమేటం జారీ చేసిన విషయం మనందరికీ తెలుసు.దీనిలో భాగంగానే బిజెపి కీలక నేతలైన బండి సంజయ్ సిరిసిల్లలో పోటీ చేయాలని, ధర్మపురి అరవింద్ ఆర్మూర్ లో, ఈటల రాజేందర్ ( Etela Rajender ) గజ్వేల్ లో ఇలా కొంతమంది నేతలు తప్పనిసరిగా అసెంబ్లీలో పోటీ చేయాలని ప్రకటన జారీ చేసింది.ఈ విధంగా తెలంగాణ బిజెపి వ్యూహం రచించిన తర్వాత కేంద్రం మాత్రం జమిలీ ఎన్నికలు ( Jamili Elections ) తప్పనిసరిగా చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.దీనిపై పూర్తిగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Telugu Assembly, Bandi Sanjay, Etela Rajender, Jamili, Telangana-Politics

ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే మాత్రం బిజెపి ( BJP ) కీలక నేతలంతా అసెంబ్లీలో పోటీ చేస్తారా లేదంటే పార్లమెంటులో పోటీ చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.ఒకవేళ జమిలి రాకుంటే అసెంబ్లీలో పోటీ చేసి ఓడిపోయిన మళ్లీ పార్లమెంట్ లో చేసే అవకాశం ఉండేది.వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తే మాత్రం తప్పనిసరిగా బిజెపి కీలక నేతలకు కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube