వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని( Perni Nani ) ఓటర్ల జాబితా పై( Voter List ) అసత్య ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు.ఇదే సమయంలో డూప్లికేట్, బోగస్ ఓట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారిని కోరినట్లు స్పష్టం చేశారు.
తాజాగా వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, అనిల్ కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో( Mukesh Kumar Meena ) భేటీ అయ్యారు.అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడటం జరిగింది.
ఎన్నికల అధికారితో సమావేశంలో ఒక మనిషికి ఒక ఓటే ఉండాలని కోరినట్లు చెప్పుకొచ్చారు.
గత 15 రోజులుగా టీడీపీకి( TDP ) మద్దతు తెలిపే కొన్ని పత్రికలు ఓటర్ల జాబితాలో అక్రమాలు అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.చంద్రబాబు హయాంలో అక్రమ ఓటర్ల నమోదు జరిగినప్పుడు ఆ పత్రికలు ఏమైపోయాయి అని ప్రశ్నించారు.తెలుగుదేశం ప్రభుత్వం సమయంలో ఒకే ఇంట్లో 510 ఓట్లు ఉన్నాయని ఆరోపించారు.
అంతేకాదు ఓటర్ కార్డుకి ఆధార్ అనుసంధానం చేయాలని కోరినట్లు కూడా చెప్పుకొచ్చారు.తెలంగాణ నుండి పదవి పోయిన బీజేపీ నేత( BJP ) ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు.
యూపీలో బీజేపీ చేసినట్టు మేము చేస్తున్నామని అనుకుంటున్నాడు.చంద్రబాబు( Chandrababu Naidu ) దగ్గర జీతానికి కొందరు పనిచేస్తున్నారు అంటూ పరోక్షంగా బండి సంజయ్ పై( Bandi Sanjay ) పేర్ని నాని మండిపడ్డారు.
మేము దొంగ ఓట్లను చేరిస్తే ఓటర్ల సంఖ్య ఎందుకు పెరగలేదు అని ప్రశ్నించారు.