ఆర్ ఎస్ శివాజీ( R S Shivaji )పేరు పరిచయం లేకపోవచ్చు కానీ ముఖం ఖచ్చితంగా చూసే ఉంటారు.ఈయన ఒక తమిళ నటుడు.
ఈయన నటించిన చాలా తమిళ సినిమాలు తెలుగు లోకి డబ్ చేయబడ్డాయి.శివాజీ గారు ఒక విలక్షణ నటుడు.
తమిళ పరిశ్రమలో మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్స్ లో ఈయన ఒకరు.ఈయన కమల్ హాసన్ కు వీరాభిమాని.
కమల్ హాసన్ చిత్రాలలో ఎక్కువగా కనిపిస్తారు.కమల్ హాసన్ హీరోగా 2003 లో విడుదలైన అంమ్బె శివమ్ (తెలుగు లో సత్యమే శివమ్) చిత్రంలో స్టేషన్ మాస్టర్ గా ఒక చిన్న పాత్ర చేసారు.
కమల్ నటించిన హే రామ్, సత్య, మైఖెల్ మదన్ కామరాజు చిత్రాలతో కూడా నటించారు.

ఈ మధ్య సాయి పల్లవి నటించిన గార్గి చిత్రంలో శివాజీ హీరోయిన్ తండ్రిగా ఒక ముఖ్య పాత్ర పోషించారు.ఈ చిత్రంలో ఆయన నటనకు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు.గార్గి చిత్రం( Gargi Movie ) చూసినవారు ఎవ్వరు ఈయన్ను మర్చిపోరు.
కేవలం సినిమాలే కాకుండా అనేక సీరియల్స్ లో కూడా నటించారు శివాజీ గారు.నటన మాత్రమే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా, సౌండ్ డిజైనర్ గా కూడా ఈయన పనిచేసారు.
కమల్ హాసన్ సొంత సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ లో పలు విభాగాలలో పనిచేసారు.

ఆర్ ఎస్ శివాజీ గారి మనందరికీ ఎంతో ఇష్టమైన ఒక పాపులర్ తెలుగు సినిమాలో కూడా నటించారు.అదే చిరంజీవి హీరోగా, శ్రీ దేవి హీరోయిన్ గా రాఘవేంద్ర రావు తెరకెక్కించిన “జగదేక వీరుడు అతిలోక సుందరి( Jagadeka Veerudu Athiloka Sundari )” చిత్రం.ఈ సినిమాలో ఈయన ఒక మాలోకం పాత్ర పోషించి మనందరినీ నవ్వించాడు.
పాత్ర చిన్నదే అయినప్పటికీ ఆయన ఈ సినిమాలో ఆయన అభినయం అందరికి గుర్తుండిపోతుంది.శివాజీ గారు సెప్టెంబర్ 2 న తుదిశ్వాస విడిచారు.
శివాజీ గారు తన సినీ కెరీర్ లో సుమారు 70 చిత్రాలలో నటించారు.ఇంకా విడుదల కానీ చంద్రముఖి 2 చిత్రం ఆయన నటించిన చివరి చిత్రం.