తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ఆలీ( Ali )ఒకరు ఈయన కుటుంబ ఆర్థిక పరిస్థితులు అప్పట్లో ఏమాత్రం బాగా లేకపోవడంతో బాలా నటుడి( Child Artist )గానే ఇండస్ట్రీలోకి వచ్చారు.ఇలా బాల నటుడిగా ఎన్నో సినిమాలలో నటించినటువంటి ఆలీ అనంతరం పెద్దయ్యాక వరుస సినిమా అవకాశాలను అందుకుంటు కమెడియన్ గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు.

ఇలా నటుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో పురస్కారాలను అవార్డులను అందుకున్నటువంటి ఈయన ఇప్పటికే కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.ఇకపోతే ఆలీ కెరీర్ మొదట్లో బాల నటుడిగా నటిస్తున్నటువంటి సమయంలో కొందరు నిర్మాతలు చాలా చులకనగా చేసేవారట ఈయనని సినిమాలలో తీసుకుని అనంతరం రెమ్యూనరేషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని తెలుస్తోంది.
ముఖ్యంగా ఓ బడా నిర్మాణ సంస్థ ఆలీతో రెండు రోజుల్లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసుకునే వారట ఇలా పూర్తి చేసుకున్న తర్వాత తనకు రెమ్యూనరేషన్ ఇవ్వకుండా ఆలీతో ఏముంది లేండి ఒక బిర్యాని ప్యాకెట్ ఇచ్చి పంపించేయండి అంటూ మాట్లాడేవారట ఇలా ఒక బిర్యానీ(Biryani )ప్యాకెట్ కోసం కూడా ఈయన ఒకప్పుడు సినిమాలు చేశారని ఈయన స్వయంగా ఓ సందర్భంలో వెల్లడించారు.

ఇలా బిర్యాని ప్యాకెట్ తీసుకున్నటువంటి ఆలీ ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి సమయం వచ్చినప్పుడు నిర్మాతలకు భారీ షాక్ ఇచ్చారని తెలుస్తుంది.ఈయన పాత్రకు సంబంధించిన షూటింగ్ చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఈయన షూటింగ్ కి రాకుండా డుమ్మా కొట్టే వారట ఇదేంటి అని నిర్మాతలు ప్రశ్నిస్తే మీరు ఇచ్చిన బిర్యాని తిని పడుకున్నానండి అందుకే రాలేకపోయాను అంటూ పరోక్షంగా వారికి చురకలు అంటేలా సమాధానం చెప్పే వారట.ఇలా రెమ్యూనరేషన్ విషయంలో కొందరు నిర్మాతలు ఆలీతో ఇబ్బందికరంగానే వ్యవహరించారని తెలుస్తుంది.

ఇక ఈయన పెరిగి పెద్దయిన తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకొని కెరియర్లో ఎంతో బిజీగా మారిపోయారు.అదేవిధంగా రెమ్యూనరేషన్ పరంగా కూడా మంచిగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందారు.ఇకపోతే ఆలీ ప్రస్తుతం సినిమాలను కాస్త తగ్గించిన పలు బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా ఈయన అభిమానులను సందడి చేస్తున్నారు.