కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన దళపతి విజయ్( Dalapati Vijay ) జోసెఫ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ”లియో”( Leo ) సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమాతో విజయ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్( Lalit Kumar ) భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత నెక్స్ట్ తన 68వ సినిమాను విజయ్ కస్టడీ డైరెక్టర్ వెంకట్ ప్రభు ( Venkat Prabhu ) దర్శకత్వంలో చేయనున్నాడు అని ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది.లియో రిలీజ్ కాకుండానే ఈ సినిమా షూట్ స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది.అలా ప్రకటించగానే ఈ సినిమాపై క్రేజీ హైప్ పెరిగింది.అతి త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుండగా ఈ సినిమాపై వెంకట్ ప్రభు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమాపై ఇంతకు ముందు నుండి ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంది.దానిని నిజం చేస్తూ విజయ్ పై 3 డైమెన్షన్ స్కానింగ్ ను తీసుకున్నట్టుగా ఇంట్రెస్టింగ్ ఫోటోలు షేర్ చేసి భవిష్యత్తుకు స్వాగతం అంటూ ఈయన చేసిన పోస్ట్ తో ఫ్యాన్స్ లో సరికొత్త ఎగ్జైట్మెంట్ పెరిగింది.చూస్తుంటే విజయ్ మునుపెన్నడూ చూడని లుక్ లో చూడబోతున్నారు అంటూ కన్ఫర్మ్ కావడంతో ఫ్యాన్స్ ఈ పోస్ట్ ను ఓ రేంజ్ లో వైరల్ చేసేస్తున్నారు.ఇక ఈ సినిమాను కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుండగా ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
అలాగే ఈ సినిమాలో ప్రముఖ నటుడు ఎస్ జె సూర్య విలన్ రోల్ లో నటిస్తున్నట్టు వార్తలు రాగా హీరోయిన్ గా ఎవరిని ఫిక్స్ చేస్తారో వేచి చూడాల్సిందే.