సౌత్ సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా స్టార్ ఫిల్మ్ మేకర్ గా రాజమౌళి( S.S.Rajamouli )కి ప్రత్యేక స్థానం దక్కింది అనడంలో సందేహం లేదు.హీరో మార్కెట్ తో సంబంధం లేకుండా రాజమౌళి తన సినిమా ల యొక్క మార్కెట్ ను క్రియేట్ చేయగల సత్తా ఉన్న దర్శకుడు అనడం లో సందేహం లేదు.
హీరోల విషయం లో పట్టింపు లేకుండా కేవలం రాజమౌళి దర్శకుడు అనే ఉద్దేశ్యంతో సినిమాలు చూస్తూ ఉంటారు.

అలాంటి పేరును దక్కించుకున్న మరో దర్శకుడు ప్రశాంత్ నీల్ అనడంలో సందేహం లేదు.సూపర్ స్టార్స్ తో సినిమా లు చేయడం ద్వారా సూపర్ స్టార్ దర్శకుడు అవ్వచ్చు అనేది కొందరి అభిప్రాయం.కానీ స్టార్స్ లేకుండానే వందల కోట్ల వసూళ్లు సాధించగల సత్తా ఉన్న దర్శకుడు ప్రశాంత్ నీల్.
కేజీఎఫ్ సినిమా( KGF movie ) తర్వాత ప్రశాంత్ నీల్ స్థాయి ఏంటి అనేది క్లారిటీ వచ్చేసింది.ఇప్పుడు ఆయన సలార్( salaar movie ) ను రెండు పార్ట్ లు గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.
ఒక సినిమాకు మూడు వందల కోట్ల పెట్టుబడి పెట్టిప్పుడు ఆయన అందుకు తగ్గ వసూళ్లు రాబట్టాలని ప్లాన్ చేస్తాడు.

వంద కోట్లకు అయిదు వందల కోట్ల చొప్పున మొత్తం రూ.1500 కోట్ల ను సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.సినిమా మేకింగ్ విషయం లో రాజమౌళిని ఫాలో అయిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు సినిమా ప్రమోషన్ విషయం లో కూడా రాజమౌళిని ఫాలో అవుతున్నాడు.
ఒక మాట చెప్పాలి అంటే రాజమౌళి ని మించి మరీ కేజీఎఫ్ ఫిల్మ్ మేకర్ సలార్ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నాడు.అంతే కాకుండా సినిమాకు భారీ ఎత్తున వసూళ్లు వచ్చే విధంగా, ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
రాజమౌళి ( S Rajamouli )ని మించిన విధంగా ప్రశాంత్ నీల్ మంచి ప్లానింగ్ తో సలార్ సినిమా తో వెయ్యి కోట్లకు పైగా ప్లాన్ చేస్తున్నాడు.