1901 నాటి సీన్ మళ్లీ రిపీట్.. దేశంలో దయనీయ పరిస్థితికి కారణం ఏంటి..?

దేశంలో వర్షాభావ పరిస్థితులు( Rains ) నెలకొంటున్నాయి.వర్షపాతం నానాటికీ తగ్గుముఖం పడుతుంది.దీంతో దేశవ్యాప్తంగా అత్యంత దయనీయమైన పరిస్థితి నెలకొంది.1901 నాటి పరిస్థితులను మళ్లీ ఇప్పుడు తలపిస్తోందని అంటున్నారు.ఆగస్టులో( August ) దేశవ్యాప్తంగా వర్షపాతం బాగా తగ్గిపోయింది.ఆగస్టులో దేశవ్యాప్తంగా 33 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ( Meteorological Department ) గణాంకాలు చెబుతున్నాయి.

 Lowest Rainfall Recorded In August Month Details, Rainfall Conditions, Country,-TeluguStop.com

రుతుపవనాల సమయం ఇంకా 20 రోజులు మాత్రమే మిగిలి ఉంది.దీంతో ఈ రోజుల్లో భారీగా వర్షాలు పడితే వర్షాభావ పరిస్థితుల నుంచి బయటపడవచ్చు.

ఆగస్టులో సాధారణ వర్షపాతం 241 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా.ఇప్పటివరకు 160.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది.సాధారణ కంటే 33 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.2005లో ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి.సాధారణం కంటే అప్పట్లో 25 తక్కువ వర్షపాతం నమోదైంది.131.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే అప్పట్లో నమోదైంది.

Telugu August, Latest, Rainfall, Monsoon, Forecast-General-Telugu

గత 120 ఏళ్లల్లో 30 శాతం కంటే తక్కువ వర్షపాతం లోటు నమోదు కావడం ఇదే తొలిసారి అని వాతావరణశాఖ చెబుతోంది.రుతుపవనాలు బలహీనపడ్డాయి.దీంతో ఈ సీజన్ లో దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు 9 శాతానికి పెరగింది.సెప్టెంబర్ లో( September ) వర్షపాతం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.పెరగకపోతే లోటు వర్షపాతం నమోదవుతుంది.

Telugu August, Latest, Rainfall, Monsoon, Forecast-General-Telugu

ఇక జులైలో 319 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.సాధారణ కంటే 13 శాతం అధికంగా నమోదైంది.గత 18 ఏళ్లల్లో చూసుకుంటే జులై నెలలో రెండోసారి అత్యధిక వర్షపాతం నమోదైంది.

అయితే ఆగస్టులో తక్కువ వర్షపాతం రికార్డు అవ్వగా.వచ్చే నెలలో పరిస్థితి మెరుగుపడవచ్చని చెబుతున్నారు.

సెప్టెంబర్ మొదటి వారంలో అల్పపీడన వ్యవస్థ ఏర్పడవచ్చని అంటున్నారు.అయితే ఇది కేవలం మధ్య భారతదేశంలోనే ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube