తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది.కేసుపై విచారణ చేస్తున్న సిట్ అధికారులు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
పేపర్ లీకేజీ కేసులో ఇప్పటివరకు 99 మంది అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.ప్రధాన నిందితుడు ప్రవీణ్ కు ముగ్గురు నిందితులు సహకరించినట్లు అధికారులు గుర్తించారు.
మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ఏ2 రాజశేఖర్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే.అయితే రాజశేఖర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు మూడోసారి తిరస్కరించింది.