ప్రస్తుత సమాజంలో ఉన్న చాలామంది ప్రజలు ఆరోగ్యం( Health ) పై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు.ఎందుకంటే ఈ రోజులలో చాలామంది రోగ నిరోధక వ్యవస్థ గురించి కాస్త ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు.
కాబట్టి అలాంటి రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన పోషకాలు ఉసిరికాయ( Amla )లో ఎక్కువగా ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.
ఈ విటమిన్ వేడి చేస్తే నశిస్తుంది కాబట్టి దీనిని అస్సలు వేడి చేయకూడదు.ఇంకా చెప్పాలంటే కార్తిక మాసం( Karthika Masam )లో చాలామంది ఉసిరి చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి దానికి పసుపు బొట్లు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు.ఈ ఆచారం ఎన్నో సంవత్సరాలుగా ఉంది.ఎందుకంటే ఉసిరి చెట్టు( Amla Tree ) ప్రజలకు ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది.ఉసిరికాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఎండకు ఆరబెట్టాలి.ఆ ఉసిరికాయ ముక్కలు ఎండిన విటమిన్ సి నశించదు.
ఎండ పెట్టిన ఉసిరి ముక్కలను పౌడర్ ల చేసుకోవాలి.
ఆ పౌడర్ ఒక సీసాలో ఉంచుకొని దాన్ని రోజు రెండు స్పూన్లు తీసుకుని ఒక చిన్న ప్లేట్లో వేసేసి అందులో మూడు నుంచి నాలుగు స్పూన్ల తేనె వేసుకోవాలి.అలా వేసుకుని పది నిమిషాల పాటు ఉసిరి పొడి తేనెను( Amla Powder Honey ) నాలుక పై వేసుకుని చప్పరిస్తూ ఉండాలి.ముఖ్యంగా చెప్పాలంటే తేనె పవర్ ఫుల్ యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే తేనే ఇలాంటి ఇన్ఫెక్షన్ ను అయినా దూరం చేస్తుంది.కాబట్టి అలాంటి ఉసిరికాయ పొడినీ క్రమం తప్పకుండా ఉపయోగించడం ఎంతో మంచిది.ఉసిరికాయ మంచిదని ఆవకాయ మాత్రం మంచిది కాదు.ఆరోగ్యానికి మంచిదని దీనిని ఎక్కువగా కూడా తీసుకోకూడదు.