చైల్డ్ ఆర్టిస్ట్ ఆని( Child Artist Annie ). ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా రాజన్న.
ఈ సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది ఆని.మొదట అనుకోకుండా ఒక రోజు అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆని ఆ తర్వాత స్టాలిన్,అతిథి, రెడీ, శౌర్యం, ఏక్ నిరంజన్,కేడీ ఖలేజా లాంటి ఎన్నో సినిమాలలో నటించింది.ఎన్ని సినిమాలలో నటించినప్పటికీ రాని గుర్తింపు రాజన్న సినిమా( Rajanna Movie )తో దక్కిందని చెప్పవచ్చు.ఆని పాత్రే సినిమాను నిలబెట్టింది.ఏకంగా ఆరు నంది అవార్డులను గెలుచుకుంది.అయితే రాజన్న సినిమా తరవాత మరో చెప్పుకోదగిన పాత్ర ఆని చేయలేదు.
ఆమె బాలనటిగా చివరిగా నటించిన చిత్రం రంగస్థలం.
చాలా గ్యాప్ తరువాత తికమక తాండ( Thika Maka Thanda ) అనే సినిమాలో ఆని లీడ్ రోల్ పోషించింది.గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇద్దరు హీరోలు.కవల సోదరులు రామకృష్ణ, హరికృష్ణ ఈ సినిమా ద్వారా హీరోలుగా పరిచయం అవుతున్నారు.
టీఎస్ఆర్ గ్రూప్ అధినేత తిరుపతి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని టీఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.గౌతమ్ మీనన్, చేరన్, విక్రమ్ కె.కుమార్ వంటి దర్శకుల దగ్గర కో-డైరెక్టర్‌గా పని చేసిన వెంకట్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఇకపోతే ఈ మధ్య కాలంలో వస్తున్న చిన్న చిన్న యూత్‌ఫుల్ సినిమాల్లో అసభ్యత ఎక్కువగా ఉంటోంది.
లిప్ లాకులు, శృంగార సన్నివేశాలు ఎక్కువగా ఉంటున్నాయి.
అయితే, తికమక తాండ మూవీలో అలాంటి వాటికి చోటు లేదని నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు( Producer Tirupathi Srinivasa Raoo ) స్పష్టం చేశారు.అర్థవంతమైన చిత్రాలు చేయాలని తాను సినిమాల్లోకి వచ్చానన్నారు.తొలి చిత్రానికి మంచి కథ కుదిరిందని.
నిరూప్ కుమార్ ఇచ్చిన కథ, వెంకట్ వర్ణించిన తీరు చూసి ఫిదా అయ్యి ఈ సినిమా చేస్తున్నాని తెలిపారు.మాటలు, సన్నివేశాలు ఎక్కడ అసభ్యత లేని కథ ఇదన్నారు.
కుటుంబ ప్రేక్షకులతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుందని తెలిపారు.సురేశ్ బొబ్బిలి సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని సిద్ శ్రీరామ్ పుత్తడి బొమ్మ పాట( Puttadi Bomma Song ) ఇప్పటికే యూట్యూబ్‌లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.1990లో గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది.సమాజంలో ఎప్పటినుండో ఉన్న ఒక సమస్య, ఆ సమస్య వల్ల ఒక గ్రామం అంతా మతిమరుపుతో బాధపడుతుంటుంది.ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారనే సామాజిక అంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.