వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జగన్ సర్కార్ కు పేర్లు మార్చడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేయడంపై లేదని విమర్శించారు.
పెన్నా టూ వంశధార ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా చంద్రబాబు పర్యటన కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రాజెక్టులను చంద్రబాబు సందర్శిస్తున్నారు.
అనంతరం మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం పూర్తయ్యాయని తెలిపారు.వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలవరాన్ని పూర్తిగా గోదావరిలో కలిపేసిందని దుయ్యబట్టారు.
కనీసం గుండ్లకమ్మ గేట్లకు మరమత్తులు కూడా చేయలేని అసమర్థ ప్రభుత్వం వైసీపీ సర్కార్ అని విమర్శించారు.మరమ్మత్తులకే నిధులు లేకపోతే మూడు రాజధానులు ఏ విధంగా కడతారని ప్రశ్నించారు.