ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్లే కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం సాధ్యమవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రామా హేమలత సక్సెస్ స్టోరీ వింటే మాత్రం ఆశ్చర్యానికి గురి కావాల్సిందేనని చెప్పవచ్చు.
వరంగల్ లో పుట్టి పెరిగిన రామా హేమలత( Rama Hemalatha ) పది ఫెయిల్ కాగా ఒంటరితనం ఈమెకు వ్యాపార పాఠాలను నేర్పించడం గమనార్హం.రెండేళ్లు కష్టపడి హేమలత పది పాసయ్యారు.
19 సంవత్సరాల వయస్సులోనే హేమలతకు కూతురు పుట్టింది.కుటుంబానికి సొంతంగా ఇన్సులేటర్స్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది.
అయితే ఊహించని విధంగా భర్త చనిపోయారు.అదే సమయంలో తల్లీదండ్రులను కోల్పోవడం ఆమెను మరింత బాధ పెట్టింది.
కూతురు చదువు కోసం హైదరాబాద్ కు వచ్చిన హేమలతకు ఏదైనా బిజినెస్ మొదలుపెడితే బాగుంటుందని అనిపించింది.
స్కూల్ ఫ్రాంఛైజీ( School franchisee ) తీసుకున్న హేమలతకు కరోనా వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి.కూతురు బీటెక్ పూర్తి చేసి యూఎస్ కు వెళ్లాక హేమలత ఒంటరి అయ్యారు.ఆ సమయంలో హేమలత మొక్కల పెంపకంపై దృష్టి పెట్టి బాల్కనీని అందంగా తీర్చిదిద్దారు.ఆ తర్వాత హేమలత స్వర్గ బాల్కనీ మేకోవర్స్ ( Balcony Makeovers )ను మొదలుపెట్టారు.50,000 రూపాయల పెట్టుబడితో బిజినెస్ మొదలుపెట్టగా ప్రస్తుతం లక్షల్లో ఆదాయం వస్తోంది.
బాల్కనీ మేకోవర్స్ తో పాటు హేమలత ఇంటీరియర్ డిజైనింగ్, స్టూడియో వర్క్స్, విల్లాలు, పార్లర్స్ కూడా చేస్తుండటం గమనార్హం.హేమలత 20 మందికి ఉపాధి కల్పిస్తుండటం గమనార్హం.ప్రముఖ సెలబ్రిటీల ఇళ్లు, స్టూడియోలను హేమలత డిజైన్ చేశారు.హేమలత బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.స్వర్గ బాల్కనీ మేకోవర్స్ యూట్యూబ్ వీడియోలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.హేమలత కెరీర్ పరంగా సక్సెస్ సాధించగా ఆమె ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.