రామాయణం ని భారీ స్కేల్ మీద భారీ బడ్జెట్ తో ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ని హీరో గా పెట్టి చేసిన ‘ఆదిపురుష్'( Adipurush ) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వాల్తా కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే.మోషన్ కాప్చర్ టెక్నాలజీ తో సుమారుగా 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కించారు.
కానీ మొదటి ఆట నుండే డివైడ్ టాక్ రావడం తో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రభాస్( Prabhas ) లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్, శ్రీ రాముడు క్యారక్టర్ చేసాడు కాబట్టి ఇండియా మొత్తం ఈ చిత్రాన్ని ఒక మూడు రోజుల పాటు ఎగబడి చూసింది.
ఆ తర్వాత నుండి టాక్ లేకపోవడం కలెక్షన్స్ రోజు రోజుకి భారీ గా తగ్గుట్టు వచ్చాయి.ఫలితంగా ఇండియా లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.
అయితే ఈ సినిమా విడుదలై 50 రోజులు దాటి చాలా రోజులే అయ్యింది.కానీ ఇప్పటి వరకు ఈ సినిమా ఓటీటీ లో ప్రసారం కాకపోవడం పై అభిమానులు మరియు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది.తెలుగు తో పాటుగా హిందీ, తమిళ, మలయాళం మరియు కన్నడ భాషలకు సంబందర్శించిన రైట్స్ మొత్తాన్ని దక్కించుకుంది.అగ్రిమెంట్ ప్రకారం ఈ చిత్రాన్ని 8 వారాల తర్వాత స్ట్రీమింగ్ చెయ్యడం ప్రారంభించాలి.8 వారాలు దాటి చాలా కాలం అయ్యింది, ఇప్పటి వరకు ఈ సినిమా స్ట్రీమింగ్ కి సంబంధించి ఎలాంటి వార్త బయటకి రాలేదు.కారణం ఓటీటీ( OTT ) ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యే విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారట.డైలాగ్స్ విషయం లో కూడా ఈ చిత్రం విమర్శలపాలైన సంగతి అందరికీ తెలిసిందే.
అవి కూడా మారుస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.అంతే కాకుండా సినిమా నిడివి దృష్ట్యా తొలగించిన కొన్ని సన్నివేశాలు కూడా జతపర్చబోతున్నారట.ఎడిటింగ్ కి బాగా సమయం పడుతుండడం వల్ల ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా పడుతూ వస్తున్నట్టు సమాచారం.కొన్ని సినిమాలు థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకొని, ఓటీటీ లో విడుదలైన తర్వాత మాత్రం చాలా యావరేజి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి.కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఫ్లాప్( Adipurush Flop ) అయ్యినప్పటికీ ఓటీటీ లో అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్నవి చాలానే ఉన్నాయి.‘ఆదిపురుష్’ చిత్రం ఏ క్యాటగిరీ కి చెందుతుందో చూడాలి.