కాల్ చేసి ఇంటికి పిలుస్తున్న అమ్మాయి.. మీక్కూడా అలాంటి కాల్‌ వస్తే...!

ఈరోజుల్లో ఇంటర్నెట్ యూజర్లను మోసగించేందుకు ప్రజల బలహీనతలను మోసగాళ్లు టార్గెట్ చేస్తున్నారు.డబ్బు లేదా అమ్మాయి ఈ రెండింటిలో ఏదో ఒక దానిని ఆశ చూపి అమాయకులను నిండా ముంచేస్తున్నారు.

 Police Arrested Honey Trap Scam Gang In Bengaluru Details, Honey Trap, Telegram-TeluguStop.com

తాజాగా బెంగళూరులో( Bengaluru ) మరొక మోసం వెలుగు చూసింది.ఈ మోసం ఎలా జరుగుతుందంటే, మోసగాళ్లు అమ్మాయిల చేత ఇంటర్నెట్ యూజర్లకు ఫోన్ చేయిస్తారు.

ఇంటికి రమ్మని ఆ అమ్మాయి చేత చాలా అమాయకంగా అడిగిస్తారు.ఏదంటే అది ఇస్తా అని ఆ అమ్మాయితో చెప్పిస్తారు.

ఆ క్యూట్ వాయిస్ విని అమ్మాయి చెప్పిన అడ్రస్ కి వెళ్తే అంతే సంగతులు.మోసగాళ్లు ఆ అడ్రస్ వచ్చిన వారిని చితకబాది వారి నుంచి డబ్బులు, ఫోన్, బంగారం మొత్తం లాగేస్తారు.

లేదంటే ఆ అమ్మాయితో( Lady ) సంహితంగా ఉన్న ఫోటోలను వీడియోలను తీసి బ్లాక్‌యిల్ చేస్తారు.

వివరాల్లోకి వెళ్తే, బెంగళూరులో యువకులను బ్లాక్‌మెయిల్ చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

ముఠాలో ప్రకాశ్‌ బాలిగర్‌, అబ్దుల్‌ ఖాదర్‌, యాసీన్‌ ఉన్నారు.వారు నేహా మెహర్‌( Neha Mehar ) అనే యువతి ఆమె స్నేహితుడు నదీమ్‌ సహాయంతో ఈ కార్యకలాపాలకు తెరతీశారు.

వీరు టెలిగ్రామ్‌ యాప్‌( Telegram ) ద్వారా 25 నుంచి 30 ఏళ్ల యువకులకు మెసేజ్‌లు పంపించి, పరిచయం పెంచుకునేవారు.తర్వాత వారిని యువతి నేహా మెల్లగా మాటల్లోకి దింపి వారిని ఓ అద్దె ఇంటికి రప్పించేది.

ఇంట్లోకి వెళ్లగానే ముఠా సీన్‌లోకి అడుగుపెట్టేది.యువతితో లైంగిక కార్యకలాపాలు సాగిస్తుండగా తాము రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని బాధితులను బెదిరించేవారు.

Telugu Bengaluru, Cyber Crimes, Honey Trap, Honey Trap Gang, Honey Trap Scam, Na

ఆ అద్దె ఇంటి లోపల సీక్రెట్ కెమెరాలు ఉంచి మొత్తం రికార్డ్ చేసేవారు.ఆ రికార్డింగ్ చూపించి అడిగినంత మనీ ఇవ్వాలని లేదంటే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బ్లాక్‌మెయిల్‌కు దిగేవారు.గత ఆరునెలలుగా ఈ ముఠా పదుల సంఖ్యలో యువకులను ఆకర్షించింది.వారి నుంచి రూ.లక్షల రూపాయలు కాజేసింది.ఇలాంటి వీడియోలు లీకైతే సమాజంలో తమ పరువు పోతుందని భయంతో బాధితులలో ఎవరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

Telugu Bengaluru, Cyber Crimes, Honey Trap, Honey Trap Gang, Honey Trap Scam, Na

ముఠా బెదిరింపులకు లొంగని ఓ ప్రైవేట్ సంస్థ ఉద్యోగి మాత్రం ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.పోలీసులు ప్రకాశ్‌, అబ్దుల్‌ ఖాదర్‌, యాసీన్‌ను అరెస్టు చేశారు.వారి నుండి రూ.20వేల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.ప్రస్తుతం నేహా, నదీమ్‌ పరారీలో ఉన్నారు.అయితే ఇలాంటి కాల్స్ వస్తే అసలు నమ్మకూడదని, టెలిగ్రామ్ యూజర్లతో పాటు సోషల్ మీడియా వినియోగదారులందరినీ పోలీసులు హెచ్చరిస్తున్నారు.అలా కాదని ఎగేసుకొని పోతే మోసపోయేది మీరే అని హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube