హిందీ చిత్రం మద్రాస్ కెఫె( Madras Cafe ) అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన రాశి ఖన్నా ( Raashii khanna ) ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో మొదటిసారి హీరోయిన్ గా టాలీవుడ్ రంగానికి పరిచయమైంది.ఈ సినిమాకి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించగా నాగశౌర్య హీరోగా చేశారు.
ఈ సినిమాతో రాశిఖన్నాకి కాస్త క్రేజ్ వచ్చినప్పటికీ సుప్రీమ్ ( Supreme ) , హైపర్ వంటి సినిమాలతో రాశిఖన్నా రేంజ్ మారిపోయింది అని చెప్పవచ్చు.ఈమె ఇప్పటికే తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్( Star heroine ) మాత్రం అవ్వలేదని చెప్పుకోవచ్చు.
దానికి ప్రధాన కారణం ఒకానొక సమయంలో రాశి ఖన్నా చాలా లావు పెరిగిపోయింది.
దాంతో కెరియర్ పీక్స్ లో ఉండగానే దర్శక నిర్మాతలు( Director Producers ) ఆమెకు అవకాశాలు ఇవ్వలేదు.ఇక ఈ కారణంతో కూడా రాశి ఖన్నా అవకాశాలు కోల్పోయింది అని చెప్పవచ్చు.అయితే ఇదంతా పక్కన పెడితే.
తాజాగా రాశి ఖన్నా తాను ప్రేమలో ఉన్నానని డేటింగ్ చేస్తున్నాను అనే సీక్రెట్ ని రివీల్ చేసింది.ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.
ప్రజెంట్ నేను ఓ వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాను.
అతనితో డేటింగ్ కూడా చేస్తున్నాను.ఇక ఆ వ్యక్తి నా అభిప్రాయాలని గౌరవిస్తున్నాడు.ఒకరికి నచ్చినవి ఏంటో మరొకరం తెలుసుకొని గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ మా రిలేషన్ ని కొనసాగిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చింది.
అంతేకాదు గతంలో తనకి అవకాశాలు రాకపోవడానికి కారణం లావుగా మారడమేనని, అయితే నేను ఓ వ్యక్తి తో ప్రేమలో పడి ఆ ప్రేమ విఫలం అయ్యేసరికి చాలా బాధలో ఉండిపోయి చివరికి ఏం చేస్తున్నానో నాకే తెలియక ఒక్కసారిగా లావెక్కాను.దాంతో తెలియకుండానే నాకు అవకాశాలు చేజారిపోయాయి.
ఆ తర్వాత ఎన్ని విధాల బరువు తగ్గాలని ట్రై చేసినా తగ్గలేకపోయాను.కానీ ఎప్పుడైతే నచ్చిన వ్యక్తితో ప్రేమలో పడి డేటింగ్ చేస్తున్నానో అప్పటినుండి నేను సులువుగా బరువు తగ్గిపోయాను అంటూ తాను ప్రేమలో ఉన్న సీక్రెట్ ని బయటపెట్టింది రాశి ఖన్నా .