ఆ స్టార్టప్ కంపెనీలో మీరు జాబ్ చేస్తున్నారా? అయితే మీకు ఓ షాకింగ్ న్యూస్!

ఆర్థికమాంద్యం రాజ్యమేలుతున్నవేళ, ప్రపంచంలోని పలు దేశాలలోని అనేక కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను మొదలు పెట్టిన సంగతి విదితమే.ఈ క్రమంలోనే ప్రముఖ స్టార్టప్ కంపెనీగా పేరుగాంచిన ‘నవీ టెక్నాలజీ’( Navi Technology ) తమ ఉద్యోగులకు గట్టి షాక్ ఇచ్చింది.

 Are You Working In That Startup Company But You Have A Shocking News, Startup Co-TeluguStop.com

ఇందులో భాగంగానే 200 మంది ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించింది.ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుడు ‘సచిన్ బన్సల్’ ( Sachin Bansal )నేతృత్వంలోనే ఈ కంపెనీ రన్ అవుతోంది.

తాజాగా నవీ టెక్నాలజీ కంపెనీ తాజాగా 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు అధికారికంగా ప్రకటించింది.ఇందులో దాదాపు 60 నుంచి 70 శాతం మంది ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగానికి చెందిన వారు కావడం గమనార్హం.

మిగిలిన 30 నుండి 40 శాతం ఉద్యోగులు వివిధ విభాగాలకు చెందిన వారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Telugu Employees, Layoffs, Navi, Startup Company-Latest News - Telugu

కాగా ఈ కంపెనీ రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని తాజా సర్వేలు చెబుతున్నాయి.2021 డిసెంబర్ నాటికి ఈ సంస్థలో ఉన్న ఉద్యోగుల సంఖ్య 4680 మంది.అయితే గత కొన్ని రోజులుగా వివిధ కంపినీల మాదిరి ఇక్కడ కూడా తొలగింపులు ప్రక్రియ మొదలైంది.

ఈ సంఖ్య త్వరలో మరింత ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయని సదరు కంపెనీకి చెందిన సీనియర్ ఉద్యోగులు చెబుతున్నారు.ఈ ఏడాది పెద్ద పెద్ద కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగించిన సంగతి అందరికీ తెలిసినదే.

Telugu Employees, Layoffs, Navi, Startup Company-Latest News - Telugu

ఇకపోతే చాలావరకు ఇప్పుడు వివిధ దేశాలలో ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్నాయి.అందులో మనదేశం కూడా లేకపోలేదు.ఆమధ్య ఏకంగా మూడోవంతు ప్రపంచ దేశాలు ఆర్థికమాంద్యం బారిన పడుతాయని ఐఎంఎఫ్( IMF ) (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) అంచనా వేసింది.ఏకంగా ప్రపంచంలో 30 లక్షల ఉద్యోగాలు ఊడుతుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.గతేడాది కంటే 2023 చాలా కఠినంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు ఇప్పటికే అంచనా వేసి చెబుతున్న పరిస్థితి.2025 వరకు ఇలాగే పరిస్థితి ఉంటుందని, మరీ ముఖ్యంగా 3 పెద్ద ఆర్థిక వ్యవస్థలు అయిన అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్ ఒకేసారి మందగిస్తాయని అంచానా వేస్తున్నారు.అయితే ఆ ఎఫెక్ట్ వివిధ దేశాలపై ఉండక తప్పదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube