రాజన్న సిరిసిల్ల జిల్లా: మహాజన్ సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గంభీరావుపేట( Gambhiraopet ) మండల అల్ప కాలికి విస్తారక్ తమిళనాడు(Tamil Nadu ) నుండి ఇన్చార్జిగా వచ్చినటువంటి శేఖర్ తో గంభీరావుపేట మండల కార్యవర్గం మోర్చాల అధ్యక్షులు శక్తి కేంద్రం ఇన్చార్జిలచే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి హాజరై మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బూత్ ను మేరా బూత్ సబ్సే మజ్బుత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక బూతు ను సందర్శించి సరళ యాప్ లో డౌన్లోడ్ చేయవలసిందిగా దీనికి ఇచ్చినటువంటి ఇన్చార్జి గారికి ప్రతి ఒక్క శక్తి కేంద్రం ప్రతి ఒక్క బూత్ అధ్యక్షుడు సహకరించవలసిందిగా కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంట అశోక్(Ashok ),జిల్లా నాయకులు వాజిద్,హుస్సేన్,పత్తి స్వామి, దేవసాని కృష్ణ, దేవేందర్ యాదవ్, రవి గౌడ్,రాజు గౌడ్, సర్వోత్తమ్, మెకార్టీ శ్రీనివాస్, ఆంజనేయులు, రాజం, రాజిరెడ్డి,మురళీమోహన్ గౌడ్, కోడె రమేష్, విగ్నేష్,రాకేష్, మల్లేష్, నర్సింలు,అన్వర్,దేవా గౌడ్,దేవేందర్,స్వామి,రాజు తదితరులు పాల్గొన్నారు.