ప్రస్తుతం తెలంగాణలో పొత్తులకు( Alliances in Telangana ) సంబంధించిన చర్చ హాట్ హాట్ గా సాగుతోంది.ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఏ పార్టీ ఎవరితో కలవబోతుంది ? ఏ పార్టీ సింగిల్ గా బరిలోకి దిగబోతుంది ? అనే చర్చ సాగుతుంటే మరోవైపు మూడు ప్రధాన పార్టీలు పొత్తులపై చేస్తున్న వ్యాఖ్యలు అర్థంకాక తలలు పట్టుకునేలా చేస్తున్నాయి.ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం బిఆర్‌ఎస్ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.ఈసారి ఎలాగైనా బిఆర్‌ఎస్ ను గద్దె దించి తాము అధికారంలోకి రావాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పట్టుదలగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ ను కేంద్రంగా చేసుకొని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు పొత్తు రాజకీయానికి తెర తీశాయి.బీజేపీ బిఆర్‌ఎస్( BJP BRS Alliance ) మద్య అంతర్గత పొత్తు కొనసాగుతోందని గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ ఆరోపిస్తోంది.ఈ ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదుగాని.అటు బీజేపీ నేతలు కూడా బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని చెబుతోంది.దీంతో ఎవరు చెప్పేది వాస్తవం ఎవరు చెప్పేది అవాస్తవం అనేది తెలియక విశ్లేషకులు సైతం తలలు పట్టుకుంటున్నారు.

బిఆర్‌ఎస్ మాత్రం తమకు ఏ పార్టీతో పొత్తు లేదని.కాంగ్రెస్( Congress ), బీజేపీ రెండు పార్టీలు ప్రత్యర్థులే అని చెబుతోంది.దీంతో ఈ పొత్తు రాజకీయం అంతా వ్యూహంలో భాగమేనేమో అనే డౌట్ రాక మానదు.
ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బద్ద శత్రువులనే సంగతి అందరికీ తెలిసిందే.ఈ రెండు పార్టీలు ఎప్పటికీ కలిసే అవకాశం లేదు.ఇక ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బిఆర్‌ఎస్ నిలిచే ప్రయత్నం చేస్తోంది.అందువల్ల ఏ పార్టీకి మద్దతు తెలిపిన.
ప్రజల్లో బిఆర్‌ఎస్ బలం తగ్గే అవకాశం ఉంది.కాబట్టి కాంగ్రెస్, బీజేపీలకు బిఆర్‌ఎస్ మద్దతు తెలిపే అవకాశమే లేదు.
ఇవన్నీ గమనిస్తే రాజకీయ నాయకులు ఆడుతున్న వ్యూహమే తప్పా.ఈ ప్రధాన పార్టీల పొత్తుల విషయంలో ఎలాంటి వాస్తవం లేదనే సంగతి ఇట్టే అర్థమైపోతుంది.