ఈనెల 30న భీమవరంలో బహిరంగ సభ ప్రకటన చేసిన నాదెండ్ల మనోహర్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్ర ఉమ్మడి గోదావరి జిల్లాలలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

 Nadendla Manohar Announced A Public Meeting In Bhimavaram On 30th Of This Month,-TeluguStop.com

ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం( YCP Government )వ్యవహరిస్తున్న తీరుపై పవన్ వేస్తున్న ప్రశ్నలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంసంగా మారుతున్నాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ యాత్ర భీమవరం కి చేరుకోవడం తెలిసిందే.

అయితే నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలలో పర్యటనపై జిల్లా నాయకులతో పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఈ నెల 30వ తారీకు భీమవరంలో వారాహి విజయ యాత్ర( Varahi Vijaya Yatra ) బహిరంగ సభ ఉంటుందని స్పష్టం చేశారు.30వ తేదీ సాయంత్రం 5 గంటలకు భీమవరం అంబేద్కర్ సెంటర్ లో సభ జరుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జన సైనికులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు.2019 ఎన్నికలలో భీమవరం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోవడం తెలిసిందే.దీంతో ఈసారి జరగబోయే ఎన్నికలలో ఇక్కడి నుండే పవన్ మరోసారి పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీంతో జరగబోయే బహిరంగ సభను జనసేన శ్రేణులు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube