మన టాలీవుడ్( Tollywood ) లో కొన్ని సినిమాలను ఎప్పటికీ మరచిపోలేము, మన చిన్నతనం లో చూసిన ఆ సినిమాలు మన మదిలో ఎప్పటికీ చెరిగిపోని ముద్రలు వేస్తుంటాయి.అలాంటి సినిమాలలో ఒకటే నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘భైరవ ద్వీపం'( Bhairava Dweepam ) అనే చిత్రం.
బాలయ్య కెరీర్ లో ఎన్నో మాస్ హిట్స్ ఉండొచ్చు, ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఉండొచ్చు, రాబొయ్యే రోజుల్లో ఆయన ఇండస్ట్రీ ని షేక్ చెయ్యొచ్చు.కానీ ‘భైరవ ద్వీపం’ లాంటి క్లాసిక్ చిత్రాన్ని మాత్రం మళ్ళీ తియ్యలేదు అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
బాలయ్య తో ‘ఆదిత్య 369′( Aditya 369 ) లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాని తీసిన సింగీతం శ్రీనివాసరావు గారే, మూడేళ్ళ తర్వాత మళ్ళీ ఆయన ‘భైరవ ద్వీపం’ లాంటి సినిమాని తీసాడు.ఇలాంటి వెండితెర అద్భుతాలు ఆరోజుల్లో కేవలం సింగీతం శ్రీనివాసరావు గారే తీసేవారు.
ఆయన విజన్ కనీసం 20 ఏళ్ళు అడ్వాన్స్ గా ఉంటుంది.
బాలయ్య బాబు తో ఎవరైనా మాస్ మసాలా సినిమాలు తియ్యాలని అనుకుంటున్నారు.కానీ సింగీతం శ్రీనివాసరావు( Singeetam Srinivasa Rao ) మాత్రం కాస్త డిఫరెంట్ గా అలోచించి, ఇలాంటి విన్నూతన ప్రయత్నాలు చేసి సఫలం అయ్యాడు.ఇక ‘భైరవ ద్వీపం’ చిత్రం లో బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించాడు అనే చెప్పాలి.
ఈ స్థాయి నటన ఆయన తరం లోని స్టార్ హీరోలెవ్వరూ కూడా చెయ్యలేరు, ఒక్క నందమూరి తారకరామారావు గారు మాత్రమే ఇలాంటి పాత్రలు మరియు సినిమాలు చెయ్యగలడు.ఆ స్థాయి చిత్రం ఇది.అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆరోజుల్లోనే 5 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కింది.కానీ ఫుల్ రన్ లో ఈ సినిమా దాదాపుగా 9 కోట్ల రూపాయిల షేర్( 9 Crore Collections ) ని రాబట్టింది.
ఆరోజుల్లో ఈ సినిమాని జనాలు ఎగబడి చూసారో, టీవీ లో నేటి తరం ఆడియన్స్ కూడా అదే విధంగా చూస్తుంటారు.
బాలయ్య అభిమానులను కాకుండా సాధారణ ప్రేక్షకులను, మీకు ఇష్టమైన బాలయ్య సినిమా( Balakrishna Movie ) ఏమిటి అని అడిగితే, వాళ్ళు చెప్పే రెండు మూడు చిత్రాల పేర్లలో ‘భైరవ ద్వీపం’ చిత్రం కూడా ఒకటి ఉంటుంది.ఇప్పుడంటే లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి, బాహుబలి( Baahubali ) లాంటి సినిమాలను తియ్యగల్తున్నాము.కానీ ఆరోజుల్లోనే ఇలాంటి సినిమాలు తెరకెక్కించడం అంటే షధారణమైన విషయం కాదు.
ఇక పోతే ఈ సినిమాలోని పాటలు కూడా మంచి హిట్ అనే సంగతి అందరికీ తెలిసిందే.ముఖ్యంగా ‘నరుడా ఓ నరుడా ఏమి కోరిక’ అంటూ సాగే పాట ఇప్పటికీ బయట వినిపిస్తూనే ఉంటుంది.
ముఖ్యంగా ఈ పాటలోని విజువల్స్ చూస్తే సింగీతం శ్రీనివాస రావు గారి విజన్ ఎలాంటిదో అందరికీ అర్థం అవుతుంది.ఆరోజుల్లోనే ఆయన ఇలా ఎలా ఆలోచించగలిగాడు అనిపిస్తుంది.
మళ్ళీ ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే చూసేందుకు ఆడియన్స్ సిద్ధం గా ఉన్నారు.బాలయ్య పుట్టినరోజు నాడు విడుదల చెయ్యాలని అనుకున్నారు కానీ, అదే రోజు ‘నరసింహ నాయుడు’ సినిమా విడుదల అవ్వడం వల్ల ‘భైరవ ద్వీపం’ వాయిదా వేశారు.