తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ వరుస సమావేశాలు నిర్వహించడంతో పాటు పార్టీ అగ్రనేతల పర్యటనలు కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా హైదరాబాద్ లో తెలంగాణ బీజేపీ కీలక సమావేశం నిర్వహించనుంది.
జూలై 8వ తేదీన జేపీ నడ్డా అధ్యక్షతన జరుగనున్న రాష్ట్ర అధ్యక్షుల సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది.అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలే టార్గెట్ బీజేపీ ఈ భేటీలు నిర్వహించనుందని సమాచారం.
కాగా గతేడాది బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా చేపట్టిన విషయం తెలిసిందే.